Published : Sep 14, 2025, 06:40 PM ISTUpdated : Sep 15, 2025, 12:12 AM IST

Asia Cup 2025, IND vs PAK Live: ఆసియా కప్ 2025 భారత్ vs పాకిస్తాన్ లైవ్ అప్డేట్స్

సారాంశం

Asia Cup 2025, IND vs PAK Live: ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్ vs పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.  

 

 

12:12 AM (IST) Sep 15

పాకిస్తాన్ పై భారత్ గెలుపు

భారత ప్లేయర్లు అద్భుతమైన ఆటతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు.

పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 127/9 పరుగులు చేసింది.

భారత జట్టు 15.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

 

 

11:02 PM (IST) Sep 14

తిలక్ వర్మ అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్

భారత్ మూడో వికెట్ ను కోల్పోయింది. తిలక్ వర్మ 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

IND 97/3 (12.2) CRR: 7.86 REQ: 4.04

 

10:22 PM (IST) Sep 14

ఉన్నంత సేపు పాక్ ను షేక్ చేశాడు.. అభిషేక్ శర్మ అవుట్

భారత్ రెండో వికెట్ ను కోల్పోయింది. అభిషేక్ శర్మ 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

IND 41/2 (3.4) CRR: 11.18 REQ: 5.33

 

10:15 PM (IST) Sep 14

గిల్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. శుభ్ మన్ గిల్ బిగ్ షాట్ ఆడటానికి ముందుకు రాగా, స్టంపౌట్ అయ్యాడు. 10 పరుగుల వద్ద గిల్ అవుట్ అయ్యాడు. 

IND 26/1 (2.2) CRR: 11.14 REQ: 5.77

 

10:07 PM (IST) Sep 14

బౌండరీలతో భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన అభిషేక్ శర్మ

మొదటి బాల్ ఫోర్.. రెండో బాల్ సిక్సర్.. అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ ను దంచికొట్టాడు. 

09:48 PM (IST) Sep 14

హార్దిక్ బౌలింగ్ ను దంచికొట్టిన షాహీన్ అఫ్రిది.. భారత్ టార్గెట్ ఎంతంటే?

పాకిస్థాన్ తమ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో షాహీన్ అఫ్రిది సిక్సర్ల మోత మోగించాడు. వరుసగా  రెండు సిక్సర్లు బాదాడు. అతను 16 బంతులు ఆడి  33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

భారత జట్టు విజయానికి 128 పరుగులు కావాలి.

09:33 PM (IST) Sep 14

8వ వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

పాకిస్తాన్ 8వ వికెట్ కోల్పోయింది. అష్రాఫ్ 11 పరుగల వద్ద అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు.

 PAK 97/8 (17.4) CRR: 5.49

 

09:25 PM (IST) Sep 14

మూడో వికెట్ తీసుకున్న కుల్దీప్ యాదవ్.. పాకిస్తాన్ 83/7

పాకిస్తాన్ 7వ వికెట్ ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ తో పర్హాన్ ను అవుట్ చేశాడు. అతను 40 పరుగుల వద్ద బిగ్ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యా కు క్యాచ్ గా చిక్కాడు.

PAK 83/7 (16.1) CRR: 5.13

09:09 PM (IST) Sep 14

కుల్దీప్ డబుల్ స్ట్రైక్

కుల్దీప్ యాదవ్  డబుల్ స్ట్రైక్ తో అదరగొట్టాడు. వరుసగా రెండు వికెట్లు తీసి పాక్ ను దెబ్బకొట్టాడు. 5వ వికెట్ గా హసన్ నవాజ్ 5 పరుగుల వద్ద, ఆ తర్వాత మహ్మద్ నవాజ్ అవుట్ అయ్యాడు.

 

PAK 64/6 (12.5) CRR: 4.99

 

09:06 PM (IST) Sep 14

కుల్దీప్ యాదవ్ కు తొలి వికెట్.. 5 వికెట్ కోల్పోయిన పాక్

పాకిస్తాన్ 5వ వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో హసన్ నవాజ్ 5 పరుగుల వద్ద అక్షర్ పటేల్ కు క్యాచ్ గా చిక్కాడు. 

PAK 64/5 (12.4) CRR: 5.05

08:55 PM (IST) Sep 14

అక్షర్ అదరగొడుతున్నాడు.. 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన పాక్

పాకిస్తాన్ 4వ వికెట్ ను కోల్పోయింది. అక్షర్ పటేల్ సూపర్ బౌలింగ్ తో తన రెండో వికెట్ గా పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ను అవుట్ చేశాడు. అతను  బౌండరీ లైన్ వద్ద అభిషేక్ శర్మకు క్యాచ్ గా దొరికిపోయాడు.

PAK 49/4 (10) CRR: 4.9

 

08:45 PM (IST) Sep 14

తొలి ఓవర్ లోనే ఫఖర్ జమాన్ ను అవుట్ చేసిన అక్షర్ పటేల్

పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్ లో బిగ్ షాట్ ఆడబోయిన ఫఖర్ జమాన్ (17 పరుగులు) క్యాచ్ రూపంలో తిలక్ వర్మ చేతికి చిక్కాడు. 

పాకిస్తాన్ : 45/3 (7.4) CRR: 5.87 

08:40 PM (IST) Sep 14

పవర్ ప్లే తర్వాత పాకిస్తాన్ 42/2

పవర్ ప్లే తర్వాత పాకిస్తాన్ 42/2 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఫఖర్ జమాన్ 16 పరుగులు (3 ఫోర్లు), సాహిబ్‌జాదా ఫర్హాన్ 19 పరుగులు (2 సిక్సర్లు) ఉన్నారు. పాకిస్థాన్ ప్రస్తుత రన్‌రేట్ 6.81గా ఉంది.

 

 

08:33 PM (IST) Sep 14

5 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ 34/2

5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది పాకిస్తాన్. క్రీజులో సాహిబ్‌జాదా ఫర్హాన్ 13 బంతుల్లో 11 పరుగులు,  ఫఖర్ జమాన్ 11 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుత రన్ రేట్ 6.8గా ఉంది.

పాకిస్తాన్ 34/2 (5 ఓవర్లు)

08:10 PM (IST) Sep 14

బూమ్ బూమ్ బుమ్రా.. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

భారత బౌలర్లు అదరగొడుతున్నారు. బుమ్రా దెబ్బతో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ హరీస్ 3 పరుగులకే అవుట్ అయ్యాడు. బుమ్రాకు క్యాచ్ గా దొరికిపోయాడు. 

PAK 6/2 (1.2) CRR: 4.5

08:05 PM (IST) Sep 14

ఫస్ట్ బాల్.. అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీసి భారత్ కు శుభారంభం అందించాడు హార్దిక్ పాండ్యా. తన ఓవర్ లో వైడ్ ప్రారంభించిన హార్దిక్ ఆ తర్వాత బంతికి సైమ్ అయూబ్ అవుట్ చేశాడు. అతను బుమ్రాకు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.

07:57 PM (IST) Sep 14

దుబాయ్ పిచ్ రిపోర్ట్

సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. "ఈ పిచ్ మిగతా వాటితో పోలిస్తే పొడిగా ఉంది, కాబట్టి స్పిన్ ఒక ముఖ్యమైన అంశం కావచ్చు" అని అన్నారు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. "పాకిస్తాన్ ఈ పిచ్ నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నట్లుంది, వారి జట్టు ఎంపికను చూస్తే ఇది అర్థమవుతుంది" అని అన్నారు. కాగా, ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి అనుకూలంగా ఉంటుంది. అయితే, మ్యాచ్ మధ్యలో స్పిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

07:49 PM (IST) Sep 14

భారత్, పాకిస్తాన్ ప్లేయింగ్ 11

భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్తాన్ జట్టు: సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మొహమ్మద్ హరీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫాహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.

 

 

07:46 PM (IST) Sep 14

మేము మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం.. : సూర్యకుమార్ యాదవ్

మేము మొదట బౌలింగ్ చేయాలనుకున్నామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మేము దీని పక్కనే ఉన్న మరో పిచ్‌పై ఆడాం, అది చాలా మంచి వికెట్. రాత్రిపూట బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు తేమ ఎక్కువగా ఉంది, కాబట్టి తరువాత మంచు ప్రభావం ఉండవచ్చు. జట్టులో ఎటువంటి మార్పులు లేవు అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

 

 

07:40 PM (IST) Sep 14

టాస్ గెలిచిన పాకిస్తాన్

టాస్‌ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా బ్యాటింగ్ ఎంచుకున్నారు.

ఆఘా మాట్లాడుతూ  “మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. చాలా ఉత్సాహంగా ఉన్నాం. పిచ్ నెమ్మదిగా కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసి బోర్డుపై పరుగులు పెట్టాలని అనుకుంటున్నాం. జట్టులో మార్పులు లేవు. ఇక్కడ 20 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కండీషన్లకు అలవాటు పడ్డాం” అని తెలిపారు.

07:38 PM (IST) Sep 14

భారత్ మాతా కీ జై.. హోరెత్తిస్తున్న ఫ్యాన్స్

పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టగానే, కొంతమంది అభిమానులు "ఇండియా జీతేగా!" "భారత్ మాతా కీ జై!" అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు.

టాస్ కౌంట్‌డౌన్ మొదలైంది, కీలకమైన సమయానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో వార్మప్‌లో బిజీగా ఉన్నారు. స్టేడియం బయట వాతావరణం ఉత్సాహంగా ఉంది, అభిమానులు "ఇండియా! ఇండియా!" అంటూ నినాదాలు చేస్తున్నారు.

06:54 PM (IST) Sep 14

ఆసియా కప్ 2025 6వ మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

• మ్యాచ్: భారత్ vs పాకిస్తాన్, 6వ మ్యాచ్, గ్రూప్ A, ఆసియా కప్ 2025

• తేదీ: ఆదివారం, సెప్టెంబర్ 14, 2025

• సమయం: రాత్రి 8:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం)

• వేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్

• అంపైర్లు: మసూదర్ రెహ్మాన్, రుచిరా పల్లియగురుగే

• థర్డ్ అంపైర్: అహ్మద్ షా

• మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్

భారత జట్టు (India Squad)

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

పాకిస్తాన్ జట్టు (Pakistan Squad)

మొహమ్మద్ హరీస్ (వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా (కెప్టెన్), సైమ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫాహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్, హుస్సేన్ తలత్, హసన్ అలీ, ఖుష్దిల్ షా, హారిస్ రవూఫ్, మొహమ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా.

06:45 PM (IST) Sep 14

బిగ్ ఫైట్ కు అంతా సిద్ధం

ఆసియా కప్ 2025లో భాగంగా భారత్‌–పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మహా పోరుకు అంతా సిద్దం అయింది.  ఈ రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు జట్లు తొలిసారి క్రికెట్ మైదానంలో ఎదురుపడటం ఉత్కంఠను రేపుతోంది.

ఈ పోరు కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుభ్‌మన్ గిల్–షాహీన్ అఫ్రిదీ, సూర్యకుమార్ యాదవ్–హారిస్ రౌఫ్ మధ్య ఉత్కంఠభరిత ఫైట్ జరిగే అవకాశం ఉంది. యంగ్ ప్లేయర్లతో నిండిన భారత జట్టు మళ్లీ పాకిస్తాన్‌పై ఆధిపత్యం చాటేందుకు సిద్ధమైంది.

భారత్-పాకిస్తాన్ లు ప్రస్తుతం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్ పోటీల్లో  మాత్రమే తలపడుతున్నాయి. ఆసియా కప్ హిస్టరీని గమనిస్తే.. భారత్ వన్డే, టీ20 ఫార్మాట్లలో పాకిస్తాన్‌పై ఆధిక్యం కొనసాగిస్తోంది.

 

 


More Trending News