Published : Sep 28, 2025, 07:03 PM ISTUpdated : Sep 29, 2025, 12:16 AM IST

IND vs PAK Live, Asia Cup 2025 Final : ఆసియా కప్ 2025 ఫైనల్ ఇండియా vs పాకిస్తాన్ లైవ్ అప్డేట్స్

సారాంశం

Asia Cup 2025 Final IND vs PAK Live: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భాగంగా ఆదివారం భారత్ vs పాకిస్తాన్ తలపడుతున్నాయి. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

India vs Pakistan Asia Cup 2025 Final IND vs PAK Live Cricket Score Updates

12:16 AM (IST) Sep 29

పాక్ పై భారత్ గెలుపు.. ఆసియా కప్ 2025 ఛాంపియన్‌గా భారత్

దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ ఓడించి భారత్ విజేతగా నిలించింది. ఆసియా కప్ 2025 ఛాంపియన్ నిలవడంతో పాటు 9వ సారి టైటిల్ ను సాధించింది.

11:36 PM (IST) Sep 28

హాఫ్ సెంచరీ కొట్టిన తిలక్ వర్మ

అబ్రార్ అహ్మద్ బౌలింగ్ చేసిన 16వ ఓవర్‌లో చివరి బంతికి తిలక్ వర్మ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 

16 ఓవర్లకు భారత్ స్కోరు 111/4 

తిలక్ వర్మ 50* పరుగులు 

శివమ్ దూబే 18* పరుగులు

11:27 PM (IST) Sep 28

100 పరుగులు పూర్తి చేసిన భారత్

భారత్ 100 పరుగులు పూర్తి చేసింది. 

IND 100/4 (15) CRR: 6.67 REQ: 9.4

దూబే 16 పరుగులు

తిలక్ 48 పరుగులు 

11:18 PM (IST) Sep 28

భారత్ నాల్గో వికెట్ డౌన్.. సంజూ అవుట్

సంజూ శాంసన్  అవుట్ అయ్యాడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్ శాంసన్  24 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

భారత  77/4

గెలవడానికి కావాల్సిన పరుగులు  46 బంతుల్లో 70 పరుగులు

11:05 PM (IST) Sep 28

10 ఓవర్ల తర్వాత భారత్ 58/3

10 ఓవర్ల తర్వాత భారత్ 3 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.

తిలక్ వర్మ 31 పరుగులు

సంజూ శాంసన్ 17 పరుగులు 

10:35 PM (IST) Sep 28

గిల్ అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్

టీమిండియా కష్టాల్లో పడింది. మూడో వికెట్ ను కోల్పోయింది. శుభ్ మన్ గిల్ 12 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

IND 20/3 (4) CRR: 5 REQ: 7.94

 

10:20 PM (IST) Sep 28

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అవుట్.. రెండో వికెట్ కోల్పోయిన భారత్

భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశపరిచాడు. 

IND 10/2 (2.3) CRR: 4 REQ: 7.83

 

10:11 PM (IST) Sep 28

అభిషేక్ శర్మ అవుట్.. బిగ్ వికెట్ కోల్పోయిన భారత్

భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఫహీమ్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. 

IND 7/1 (1.2) CRR: 5.25 REQ: 7.5

 

09:44 PM (IST) Sep 28

146 పరుగులకు పాకిస్తాన్ అలౌట్

పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. 84 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయిన పాక్ 146 పరుగులకు ఆలౌట్ అయింది.

PAK 146 (19.1) CRR: 7.62

 

09:40 PM (IST) Sep 28

పాక్ తొమ్మిదో వికెట్ డౌన్.. హారిస్ రవూఫ్‌ తిరిగిచ్చేసిన బుమ్రా

పాక్ 9వ వికెట్ కోల్పోయింది. హారిస్ రవూఫ్‌ (6) ను అద్భుతమైన బంతితో బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 

PAK 145/9 (18.5) CRR: 7.7

 

 

09:31 PM (IST) Sep 28

21 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్

పాకిస్తాన్ 8వ వికెట్ కోల్పోయింది. కేవలం లాస్ట్ 21 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఫహీమ్ 0 కే అవుట్ అయ్యాడు. 

PAK 134/8 (17) CRR: 7.88

 

09:29 PM (IST) Sep 28

7వ వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

7వ వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. అఫ్రిదీ జీరోకే అవుట్ అయ్యాడు. 

PAK 134/7 (16.4) CRR: 8.04

 

09:27 PM (IST) Sep 28

పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అవుట్

పాకిస్తాన్ 6వ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సల్మాన్ అఘా 8 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 

PAK 134/6 (16.3) CRR: 8.12

 

09:20 PM (IST) Sep 28

ఐదో వికెట్ కోల్పోయిన పాక్.. భారత్ బౌలర్లు అదరగొడుతున్నారు

భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ప్రారంభంలో వికెట్లు తీయడానికి కష్టపడిన బౌలర్లు ఇప్పుడు వరుస వికెట్లతో పాక్ కు షాక్ ఇస్తున్నారు. పాక్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ బౌలింగ్ లో హుస్సేన్ తలత్ అవుట్ అయ్యాడు. 

PAK 132/5 (15.5) CRR: 8.34

 

 

09:13 PM (IST) Sep 28

ఫఖర్ అవుట్.. పాక్ నాల్గో వికెట్ డౌన్

పాకిస్తాన్ నాల్గో వికెట్ ను కోల్పోయింది. ఫఖర్ జమాన్ 46 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో సిక్సర్ కొట్టి తర్వాత బంతికి కుల్దీప్ కు క్యాచ్ గా చిక్కాడు.

PAK 127/4 (14.5) CRR: 8.56

 

09:08 PM (IST) Sep 28

ట్రాక్ లోకి వచ్చిన భారత బౌలర్లు.. మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. మహ్మద్ హారీస్ పరుగులు చేయకుండానే అవుటో అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో అతను రింకూ సింగ్ కు క్యాచ్ గా చిక్కాడు.

PAK 115/3 (13.4) CRR: 8.41

 

09:04 PM (IST) Sep 28

సైమ్ అవుట్.. పాక్ రెండో వికెట్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్

పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. సైమ్ ఆయూబ్ 11 పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. బుమ్రా అద్భుతమైన క్యాచ్ తో సైమ్ కు పెవిలియన్ దారి చూపించాడు.

PAK 113/2 (12.5) CRR: 8.81

 

09:01 PM (IST) Sep 28

100 పరుగులు పూర్తి చేసిన పాక్.. భారత్ వికెట్ల వేట

పాకిస్తాన్ 100 పరుగులు పూర్తి చేసుకుంది. 

PAK 112/1 (12.3) CRR: 8.96

 

08:59 PM (IST) Sep 28

84 పరుగుల భాగస్వామ్యంతో పాక్ రికార్డు

ఏదైనా ఒక పూర్తి సభ్య దేశం 5 లేదా అంతకంటే ఎక్కువ జట్లు పాల్గొన్న టోర్నమెంట్ ఫైనల్‌లో నమోదు చేసిన అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యం (ఓపెనింగ్ స్టాండ్) ఇదే. గతంలోని 48 పరుగుల రికార్డు బ్రేక్ అయింది. ఆ 48 పరుగుల రికార్డును 2009 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో లార్డ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లైన కామ్రాన్ అక్మల్, షాజెబ్ హసన్ నెలకొల్పారు.

08:47 PM (IST) Sep 28

ఫర్హాన్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పర్హాన్ (57 పరుగులు) బిగ్ షాట్ కొట్టగా.. తిలక్ వర్మకు క్యాచ్ గా చిక్కాడు. 

PAK 84/1 (9.4) CRR: 8.69

ఫఖర్ 23* రన్స్

 

08:42 PM (IST) Sep 28

హాఫ్ సెంచరీ కొట్టిన ఫర్హాన్

పాకిస్తాన్ కు మంచి ఆరంభం లభించింది. పర్హాన్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. 

PAK 77/0 (9) CRR: 8.56

 

08:32 PM (IST) Sep 28

పవర్ ప్లే తర్వాత పాకిస్తాన్ 45/0

పవర్ ప్లే తర్వాత పాకిస్తాన్ 45/0 పరుగులు చేసింది. 

 

PAK 45/0 (6) CRR: 7.5

ఫర్హాన్ 32

ఫకార్ జమాన్ 13

 

 

08:27 PM (IST) Sep 28

5 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ 37/0

భారత్ పెద్దగా పరుగులు ఇవ్వకుండా పాక్ ను అడ్డుకుంటోంది. అయితే, వికెట్లు తీయడంలో సక్సెస్ కాలేదు. పాక్ 5 ఓవర్ల తర్వాత 37/0 పరుగులు చేసింది. 

 

PAK 37/0 (5) CRR: 7.4

 

 

08:09 PM (IST) Sep 28

తొలి ఓవర్ వేసిన దూబే

భారత బౌలింగ్ ఇన్నింగ్స్ ను శివమ్ దూబే ప్రారంభించాడు. తన తొలి ఓవర్ లో 4 పరుగులు ఇచ్చాడు.

07:39 PM (IST) Sep 28

పాకిస్తాన్ జట్టు ఇదే

పాకిస్తాన్ జట్టు ప్లేయింగ్ 11 

  1. సాహిబ్‌జాదా ఫర్హాన్
  2. ఫఖర్ జమాన్
  3. సైమ్ అయూబ్
  4. సల్మాన్ ఆఘా (కెప్టెన్)
  5. హుస్సేన్ తలత్
  6. మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్)
  7. మహ్మద్ నవాజ్
  8. ఫహీమ్ అష్రఫ్
  9. షాహీన్ అఫ్రిది
  10. హారిస్ రవూఫ్
  11. అబ్రార్ అహ్మద్

07:38 PM (IST) Sep 28

హార్దిక్ పాండ్యా అవుట్... భారత జట్టు ఇదే

భారత జట్టు ప్లేయింగ్ 11 

  1. అభిషేక్ శర్మ
  2. శుభ్‌మన్ గిల్
  3. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
  4. తిలక్ వర్మ
  5. సంజు శాంసన్ (వికెట్ కీపర్)
  6. శివమ్ దూబే
  7. రింకు సింగ్
  8. అక్షర్ పటేల్
  9. కుల్దీప్ యాదవ్
  10. జస్‌ప్రీత్ బుమ్రా
  11. వరుణ్ చక్రవర్తి

07:32 PM (IST) Sep 28

టాస్ ఓడిన పాకిస్తాన్

టాస్ గెలిచిన భారత్.. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. 

07:06 PM (IST) Sep 28

41 ఏళ్లలో తొలిసారి.. భారత్ vs పాక్ బిగ్ ఫైట్

ఆసియా కప్ 2025లో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరు.. సెప్టెంబర్ 28న ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఈ రెండు జట్లు ఫైనల్‌లో ఎదురెదురయ్యాయి.

భారత్ ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో అజేయంగా కొనసాగింది. ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటీ ఓడిపోకుండా ఫైనల్‌కు చేరింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ వరుసగా మూడు అర్ధశతకాలు సాధించి జట్టుకు బలాన్ని చేకూర్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ భారత జట్టు సమతౌల్య ప్రదర్శనతో ముందంజ వేసింది.

ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, టోర్నమెంట్ మొత్తం మీద దాని ప్రదర్శన స్థిరంగా లేదు. బ్యాటింగ్‌లో సమస్యలు ఎదురైనా బౌలర్ల సహకారంతో ఫైనల్ వరకు చేరింది. అయితే భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇప్పుడు టైటిల్ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో మైదానంలోకి దిగనుంది.

దుబాయ్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో బౌలర్లకూ సహకారం అందించే పరిస్థితులు ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు టాస్ జరగనుంది. ఈ ఫైనల్ ఆసియా కప్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలవనుంది.


More Trending News