విరాట్ కోహ్లీని ఘోరంగా అవమానించిన వీరేంద్ర సెహ్వాగ్... వీరూ కామెంటరీపై ఫ్యాన్స్ సీరియస్...

Published : Jul 03, 2022, 10:32 PM IST
విరాట్ కోహ్లీని ఘోరంగా అవమానించిన వీరేంద్ర సెహ్వాగ్... వీరూ కామెంటరీపై ఫ్యాన్స్ సీరియస్...

సారాంశం

Virat Kohli: జో రూట్ అవుటైన తర్వాత క్రీజులో డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ... కోహ్లీని అసభ్య పదజాలంతో ట్రోల్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్...

టీమిండియాలోని మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ తన భావోద్వేగాలను ఏ మాత్రం దాచుకోలేదు. క్రీజులో సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆవేశం వచ్చినా ఆపుకోలేని  విరాట్ కోహ్లీ... క్రికెట్ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో ముందుంటాడు. అయితే విరాట్ కోహ్లీలోని ఈ యాంగిల్ కొంతమందికి నచ్చుతుంది, మరికొంతమందికి ఏ మాత్రం నచ్చదు..

తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో కూడా విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో యానిమేటెడ్‌ కోణాన్ని చూపించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోని సెడ్జ్ చేసిన విరాట్ కోహ్లీ, అతను సెంచరీ చేసిన తర్వాత చప్పట్లతో అభినందించాడు...

జానీ బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ని అందుకున్న విరాట్ కోహ్లీ, ఫ్లైయింగ్ కిస్‌తో సెంచరీ హీరోని పెవిలియన్‌కి సాగనంపాడు. అంతకుముందు ఆట రెండో రోజున జో రూట్ అవుటైన తర్వాత విరాట్ కోహ్లీ ఆ వికెట్‌ని డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సమయంలో హిందీ కామెంటరీ బాక్సులో ఉన్న భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... ‘ఛమీయా నాచ్ రహీ హూ’ (ఛమీయా డ్యాన్స్ చేస్తోంది) అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది...

ఛమీయా అనే పదాన్ని హిజ్రా అనే అర్థం వచ్చేలా వాడతారు. దీంతో భారత జట్టుకి అత్యధిక టెస్టు విజయాలు అందించి, అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన క్రికెటర్‌ని ఇలాంటి వ్యాఖ్యంతో సంభోదించడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు... విరాట్ కోహ్లీని ‘ఛమీయా’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేసిన వీడియో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అంతకుముందు జానీ బెయిర్‌స్టోని సెడ్జ్ చేసిన విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్‌. ‘విరాట్ కోహ్లీ సెడ్జ్ చేయకుముందు జానీ బెయిర్‌స్టో స్ట్రైయిక్ రేటు 21. ఆ తర్వాత 150. పూజారాలా ఆడుతున్నవాడిని సెడ్జ్ చేసి రిషబ్ పంత్‌ని చేసేశావుగా కోహ్లీ...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...

కోహ్లీని ‘ఛమీయా’ అంటూ అవమానించిన వీరేంద్ర సెహ్వాగ్‌పై కామెంట్లతో, ట్రోల్స్ విరుచుకుపడుతున్నారు విరాట్ అభిమానులు. సొంత ప్లేయర్‌ని కూడా గౌరవించలేని మాజీ క్రికెటర్లు, కామెంటరీ బాక్సులో ఉండడానికి పనికి రారని పోస్టులు చేస్తున్నారు...

జానీ బెయిర్ స్టో, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి 61 అంతర్జాతీయ సెంచరీలు చేస్తే, విరాట్ కోహ్లీ ఒక్కడే 70 అంతర్జాతీయ సెంచరీలు చేశాడనే విషయాన్ని ట్వీట్ల ద్వారా గుర్తు చేస్తున్నారు. మరో వర్గం ఎప్పటిలాగే విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తోంది. మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఈ ఏడాదిలో ఐదు సెంచరీలు చేసిన జానీ బెయిర్‌స్టోని సెడ్జ్ చేయడం హ్యాస్యాస్పదంగా ఉందని పోస్టులు చేస్తున్నారు...

అయితే కోహ్లీని తీవ్రంగా అవమానించిన వీరేంద్ర సెహ్వాగ్, ఆ వెంటనే తాను చేసిన తప్పిదాన్ని గుర్తించి... విరాట్ ఆటతీరును పొడుగుతూ కామెంట్లు చేశాడు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నారు. మరి దీనిపై సెహ్వాగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి...

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !