Published : Jul 27, 2025, 02:59 PM ISTUpdated : Jul 27, 2025, 10:20 PM IST

India vs England 4th Test Day 5 Live: ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టు 4వ రోజు లైవ్ అప్డేట్స్

సారాంశం

India vs England 4th Test Day 5 Live : మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్ నాల్గో టెస్టు 5వ రోజు లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

10:20 PM (IST) Jul 27

డ్రా గా ముగిసిన మాంచెస్టర్ టెస్టు

  • మాంచెస్టర్ టెస్టు డ్రా గా ముగిసింది. 
  • ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసింది. 
  • భారత్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 425/4 పరుగులతో 5వ రోజు ఆటను ముగించింది. దీంతో మ్యాచ్ డ్రా అయింది. 
  • 5వ రోజు కెప్టెన్ శుభ్ మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు సెంచరీలతో అదరగొట్టారు. 
  • కేఎల్ రాహుల్ 90 పరుగుల వద్ద అవుట్ అయి 10 పరుగుల దూరంలో సెంచరీని మిస్ అయ్యాడు.

 

 

10:15 PM (IST) Jul 27

సెంచరీ కొట్టిన వాషింగ్టన్ సుందర్

మాంచెస్టర్ టెస్టులో వాషింగ్టన్ సుందర్ సెంచరీ కొట్టాడు. జడేజాతో కలిసి భారత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. సుందర్ కు ఇది మొదటి టెస్టు సెంచరీ కావడం విశేషం. 

 

 

 

10:07 PM (IST) Jul 27

అదరిపోయే సెంచరీ కొట్టిన జడేజా

మాంచెస్టర్ లో జడేజా బ్యాటింగ్ లో దుమ్మురేపాడు. సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ గెలుపు ఆశలను దెబ్బతీశాడు. 

 

 

07:57 PM (IST) Jul 27

రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు

మాంచెస్టర్ లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు హాఫ్ సెంచరీలు కొట్టారు. దీంతో భారత్ స్కోర్ 300 పరుగులు దాటింది. 

భారత్ : 313/4 (112 ఓవర్లు)

వాషింగ్టన్ సుందర్ 52* పరుగులు

రవీంద్ర జడేజా 50* పరుగులు 

 

 

 

05:51 PM (IST) Jul 27

గిల్ అవుట్.. నాల్గో వికెట్ కోల్పోయిన భారత్

భారత జట్టు నాల్గో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీ (103 పరుగులు) తర్వాత అవుట్ అయ్యారు. 

భారత్ : 223/4 (89)

వాషింగ్టన్ సుందర్ 21* పరుగులు

రవీంద్ర జడేజా *

 

 

05:22 PM (IST) Jul 27

సెంచరీ కొట్టిన శుభ్ మన్ గిల్.. కెప్టెన్ నాక్ అదిరిపోయింది !

మాంచెస్టర్ లో శుభ్ మన్ గిల్ సెంచరీ కొట్టారు. అద్భుతమైన కెప్టెన్ నాక్ తో భారత స్కోర్ బోర్డును నడిపిస్తున్నారు. 5వ రోజు గిల్ తన సెంచరీని పూర్తి చేశారు. 

 

 

04:36 PM (IST) Jul 27

శుభ్ మన్ గిల్ మరో ఘనత.. భారత్ 193-3 పరుగులు

భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీకి చేరువయ్యాడు. 90 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్ లో అతను 700 పరుగులను పూర్తి చేశాడు.  గిల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. 

భారత్ : 193-3

 

04:30 PM (IST) Jul 27

కేఎల్ రాహుల్ సెంచరీ మిస్.. 3 వికెట్ కోల్పోయిన భారత్

కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ అయ్యాడు. 90 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.  బెన్స్ స్టోక్స్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 

 

 


More Trending News