Published : Jul 26, 2025, 03:07 PM ISTUpdated : Jul 26, 2025, 11:24 PM IST

India vs England 4th Test Day 4 Live: ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టు 4వ రోజు లైవ్ అప్డేట్స్

సారాంశం

India vs England 4th Test Day 4 Live : మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్ నాల్గో టెస్టు నాల్గో రోజు లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

11:24 PM (IST) Jul 26

174/2 పరుగులతో 4వ రోజు ఆటను ముగించిన కేఎల్ రాహుల్, గిల్

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో నాల్గవ రోజు ఆట ముగిసింది. కేఎల్ రాహుల్ (87* పరుగులు), శుభ్‌మన్ గిల్ (78* పరుగులు) అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను 174/2 స్కోరు వద్దకు చేర్చారు. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ కంటే 137 పరుగుల వెనుకంజలో ఉంది.

లంచ్ సమయానికి భారత్ స్కోరు:1/2 పరుగులు

టీ సమయానికి భారత్ స్కోరు: 86/2 పరుగులు

4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు:174/2 పరుగులు

 

 

 

10:42 PM (IST) Jul 26

గిల్, రాహుల్ అద్భుతమైన 100 పరుగులకు పైగా భాగస్వామ్యం

శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నారు. 39వ ఓవర్‌లో వారిద్దరూ కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. గిల్, కేఎల్ రాహుల్ మధ్య 100 పరుగుల భాగస్వామ్యం ఏర్పడటం ఇది మొదటిసారి.

టెస్ట్ క్రికెట్‌లో 0/2 పరుగులతో నుంచి 100+ మూడవ వికెట్ భాగస్వామ్యాలు ఇవే:

164* పరుగులు: కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్ (2025)

105 పరుగులు: మొహిందర్ అమర్‌నాథ్, గుండప్ప విశ్వనాథ్ vs ఆస్ట్రేలియా (1977/78)

102 పరుగులు: ఆర్చీ మ్యాక్‌లారెన్, స్టాన్లీ జాక్సన్ (ఇంగ్లండ్) vs ఆస్ట్రేలియా (1902)

 

 

10:37 PM (IST) Jul 26

కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ

కేఎల్ రాహుల్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. డాసన్ బౌలింగ్‌లో రాహుల్ సింగిల్ తీసి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఈ సిరీస్‌లో రాహుల్ సాధించిన మరో అద్భుతమైన హాఫ్ సెంచరీ ఇది. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ 50 పరుగులు చాలా విలువైనవి. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో రాహుల్ క్రీజులో నిలబడి కీలక పరుగులు చేయడం విశేషం.

 

 

08:45 PM (IST) Jul 26

హాఫ్ సెంచరీ కొట్టిన శుభ్ మన్ గిల్

మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 

భారత్: 93/2 (31) పరుగులు  

శుభ్ మన్ గిల్ 53 పరుగులు

కేఎల్ రాహుల్ 36 పరుగులు 

 

 

05:37 PM (IST) Jul 26

భారత్ కు బిగ్ షాక్.. రెండు బంతుల్లో రెండు వికెట్లు

భారత్ కు బిగ్ షాక్ తగిలింది. రెండో ఇన్నింగ్స్ లో తొలి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది.

క్రిస్ వోక్స్ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వరుస బంతుల్లో అవుట్ అయ్యారు.

ఒక ఓవర్ తర్వాత భారత్ 0/2 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 

క్రీజులో కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ ఉన్నారు.

05:27 PM (IST) Jul 26

669 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్

ఎట్టకేలకు బ్రైడన్ కార్సే (47 పరుగులు) అవుటవడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బౌండరీ లైన్ వద్ద సులభమైన క్యాచ్ ఇవ్వడంతో కార్సే ఇన్నింగ్స్ ముగిసింది.

669 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో నలుగురు 100 పరుగులకు పైగా సమర్పించుకున్నారు:

* బుమ్రా: 2 వికెట్లకు 112 పరుగులు 

* సిరాజ్: 1 వికెట్‌కు 140 పరుగులు 

* జడేజా: 4 వికెట్లకు 143 పరుగులు 

* వాషింగ్టన్ సుందర్: 2 వికెట్లకు 107 పరుగులు

 

04:59 PM (IST) Jul 26

7000 టెస్ట్ పరుగుల క్లబ్‌లో చేరిన బెన్ స్టోక్స్

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన బ్యాటింగ్‌తో అదరగొడుతూ, లాంగ్-ఆఫ్ మీదుగా అలవోకగా సిక్స్ కొట్టి 7000 టెస్ట్ పరుగుల మార్కును చేరుకున్నాడు. ఆ వెంటనే తర్వాతి బంతిని కవర్స్ మీదుగా బౌండరీకి పంపాడు.

స్టోక్స్ ఈ ఘనతతో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 7000కు పైగా పరుగులు, 200కు పైగా వికెట్లు సాధించిన ఆటగాళ్లలో అతను మూడో వ్యక్తిగా నిలిచాడు. ఈ జాబితాలో జాక్వెస్ కల్లిస్, గ్యారీ సోబర్స్ మాత్రమే స్టోక్స్‌కు ముందున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు: 614/8

04:48 PM (IST) Jul 26

600 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లాండ్

600 పరుగులు!

 సిరాజ్ బౌలింగ్‌లో కార్సే బ్యాట్ ఎడ్జ్ తగిలి బంతి సుదర్శన్ పక్కన నుంచి బౌండరీకి దూసుకుపోవడంతో ఇంగ్లాండ్ 600 పరుగుల మార్కును దాటింది. టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులకు పైగా పరుగులు ఇవ్వడం 11 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్ డిక్లేర్ చేసే తొందరలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఇంగ్లాండ్: 148 ఓవర్లలో 602/8

04:43 PM (IST) Jul 26

మాంచెస్టర్ లో సెంచరీ కొట్టిన బెన్ స్టోక్స్

బెన్ స్టోక్స్ తన 14వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండు సంవత్సరాల తర్వాత స్టోక్స్‌కు ఇది మొదటి టెస్ట్ సెంచరీ కావడం విశేషం. సిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి స్టోక్స్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఈ సెంచరీతో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, ఐదు వికెట్లు తీసిన కెప్టెన్‌ల అరుదైన జాబితాలో స్టోక్స్ చేరాడు.

ఒకే టెస్టులో సెంచరీ, ఐదు వికెట్లు తీసిన టెస్ట్ కెప్టెన్లు:

 * బెన్ స్టోక్స్ v భారత్ (2025*)

 * ఇమ్రాన్ ఖాన్ v భారత్ (1983)

 * ముష్తాక్ మొహమ్మద్ v వెస్టిండీస్ (1977)

 * గ్యారీ సోబర్స్ v ఇంగ్లండ్ (1966) 

* డెనిస్ అట్కిన్సన్ v ఆస్ట్రేలియా (1955)

04:08 PM (IST) Jul 26

8వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. డా సన్ 26 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ 576-8 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.


More Trending News