Published : Jul 25, 2025, 03:07 PM ISTUpdated : Jul 25, 2025, 11:09 PM IST

India vs England 4th Test Day 3 Live: ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టు 3వ రోజు లైవ్ అప్డేట్స్

సారాంశం

India vs England 4th Test Day 3 Live : మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్ నాల్గో టెస్టు మూడో రోజు లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

11:09 PM (IST) Jul 25

544/7 పరుగులతో మూడో రోజు ఆటను ముగించిన ఇంగ్లాండ్

మాంచెస్టర్ లో టెస్టులో మూడో రోజు ఆటను ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 544 పరుగుల వద్ద ముగించింది. 

 

ఇంగ్లాండ్: 544/7

స్టోక్స్: 77* (134)

డాసన్: 21* (52)

 

 

10:02 PM (IST) Jul 25

జోరూట్ అవుట్.. 5వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 500/5*

మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ 500 పరుగులు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే తన ఐదో వికెట్ ను కోల్పోయింది. జోరూట్ 150 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

 

 

09:59 PM (IST) Jul 25

మాంచెస్టర్ లో జోరూట్ జోరు.. 150*

ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది. జోరూట్ 150 పరుగులతో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ 500 పరుగుల మార్కును అందుకుంది. 

 

 

07:38 PM (IST) Jul 25

మాంచెస్టర్ లో సెంచరీ కొట్టిన జోరూట్.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్

మాంచెస్టర్ టెస్టులో భారత్ పై జోరూట్ సెంచరీ కొట్టాడు. అతని సెంచరీతో ఆ జట్టు 400+ పరుగుల మార్కును అందుకుంది. జోరూట్ టెస్టు కెరీర్ లో ఇది 38వ సెంచరీ కావడం విశేషం. 

ఇంగ్లాండ్ 408-4 (95.3 ఓవర్లు) 

జోరూట్ 104 పరుగులు

బెన్ స్టోక్స్ 28 పరుగులు

 

 

07:07 PM (IST) Jul 25

హ్యారీ బ్రూక్ అవుట్.. 4వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ నాల్గో వికెట్ ను కోల్పోయింది. హ్యారీ బ్రూక్ 3 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అతని కంటే ముందు ఓలీ పోప్ 71 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

 

 

05:42 PM (IST) Jul 25

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు.. పాంటింగ్ ను దాటేసిన జో రూట్

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్ల లిస్టులో జోరూట్ రెండో స్థానంలోకి చేరాడు. టాప్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. అలాగే, రికీ పాటింగ్ ను రూట్ అధిగమించాడు. 

టెస్ట్ క్రికెట్‌లో 50 కంటే ఎక్కువ స్కోర్లు

119 - సచిన్ టెండూల్కర్

104 - జో రూట్

103 - రికీ పాంటింగ్

103 - జాక్వెస్ కాలిస్

99 - రాహుల్ ద్రవిడ్

 

 

 

05:36 PM (IST) Jul 25

హాఫ్ సెంచరీ కొట్టిన జో రూట్

జో రూట్ తన 67వ టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అలాగే, ఓలీ పోప్ కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 

 

 

 

03:41 PM (IST) Jul 25

మూడో రోజు బ్యాటింగ్ కు అనుకూలంగా మాంచెస్టర్ పిచ్

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. స్టువర్ట్ బ్రాడ్, నాసర్ హుస్సేన్ లాంటి ప్రముఖులు కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మూడవ రోజు సాధారణంగా "మూవింగ్ డే"గా పరిగణిస్తారు. కానీ ఈరోజు బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ఇంగ్లాండ్ ఓపెనర్లు డకెట్ (94),  క్రాలీ (84) భారీ భాగస్వామ్యం అందించి భారత్‌పై ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లు మూడో రోజు రాణిస్తేనే మ్యాచ్ పై పట్టు నిలుపుకుంటుంది. స్పిన్నర్లు నాలుగో, ఐదవ రోజుల్లో ప్రధాన పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.

 

 

03:16 PM (IST) Jul 25

రెండో రోజు అంతా ఇంగ్లాండ్‌దే – మరి మూడో రోజు భారత్ ఏం చేయనుంది?

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు పూర్తిగా ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని చూపించింది. గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 225 పరుగులకు రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఇంకా కేవలం 133 పరుగుల దూరంలో ఉంది.

మాంచెస్టర్ టెస్టు ఇప్పటివరకు అప్డేట్స్

  • ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్ (94 పరుగులు) జాక్ క్రాలీ (84 పరుగులు) అద్భుతమైన ఆటతో మొదటి వికెట్ భాగస్వామ్యం (166 పరుగులు) అందించారు.
  • ఇద్దరూ సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయ్యారు.
  • రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓలీ పోప్ (20 పరుగులు), జో రూట్ (11 పరుగులు) క్రీజులో ఉన్నారు.

భారత ఇన్నింగ్స్ విషయానికి వస్తే..

  • రెండో రోజు ప్రారంభంలోనే రవీంద్ర జడేజా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
  • శార్దూల్ ఠాకూర్ (41 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (27 పరుగులు) కొంత పోరాటం చేశారు.
  • గాయంతో బాధపడుతున్నా రిషభ్ పంత్ క్రీజులోకి తిరిగి వచ్చి 75 బంతుల్లో 54 పరుగులు చేయడం విశేషం.

ఇంగ్లాండ్ బౌలింగ్

  • కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లు (72 పరుగులకు) తీసి కీలక పాత్ర పోషించాడు.

More Trending News