Published : Jul 12, 2025, 02:58 PM ISTUpdated : Jul 12, 2025, 11:30 PM IST

India vs England 3rd Test Day 3 Live : ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ అప్డేట్స్

సారాంశం

India vs England: 3rd Test Day 3 Live : లండన్‌లోని లార్డ్స్‌ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు 3వ రోజు లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

11:30 PM (IST) Jul 12

ముగిసిన మూడో రోజు ఆట.. తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమం.. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 2/0 పరుగులు

ఇంగ్లాండ్ vs ఇండియా 3వ టెస్ట్ 3వ రోజు ఆట ముగిసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ 387 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ స్కోర్ ను సమం చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 పరుగులు చేసింది.

 

 

10:52 PM (IST) Jul 12

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో స్కోర్ 387/10

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 387/10 పరుగులు చేసింది. 

భారత బ్యాటింగ్ 

  • కేఎల్ రాహుల్ 100 పరుగులు
  • కరుణ్ నాయర్ 40
  • రిషబ్ పంత్ 74
  • జడేజా 72
  • నితీష్ కుమార్ 30

ఇంగ్లాండ్ బౌలింగ్ 

  • క్రిస్ వోక్స్ 3 వికెట్లు
  • జోఫ్రా ఆర్చర్ 2 
  • బెన్స్ స్టోక్స్ 2 

తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఇంగ్లాండ్ జట్ల స్కోర్లు సమంగా ఉన్నాయి.

 

 

10:47 PM (IST) Jul 12

వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్.. 387 పరుగులకు ఆలౌట్

టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ పరుగులతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ ను సమం చేసింది. 

 

 

10:45 PM (IST) Jul 12

జడేజా ఔట్.. భారత్ 376/7

 

భారత్ బిగ్ వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా 72 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, ఎనిమిది ఫోర్లు బాదాడు.

ఇండియా 376/7

 

09:50 PM (IST) Jul 12

సెంచరీ దిశగా జడేజా.. భారత్ 374/6

రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ దిశగా ముందుకు సాగుతున్నాడు. 

భారత్ 374/6

రవీంద్ర జడేజా 72*

వాషింగ్టన్ సుందర్ 19*

 

 

09:47 PM (IST) Jul 12

నితీష్ కుమార్ రెడ్డి ఔట్

భారత్ 6వ వికెట్ కోల్పోయింది. నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఇండియా 326/6

 

 

 

07:18 PM (IST) Jul 12

సెంచరీ హీరో కేఎల్ రాహుల్ అవుట్.. భారత్ 290/5 పరుగులు

కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టిన తర్వాత అవుట్ అయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. లర్డ్స్‌లో రెండు సెంచరీలు కొట్టిన నాలుగవ విదేశీ ఓపెనర్‌గా నిలిచాడు. 2000 తర్వాత ఇంగ్లాండ్‌లో ఓపెనర్‌గా ఇది నాలుగవ సెంచరీ కాగా, గ్రేమ్ స్మిత్ (5) తర్వాత రెండో అత్యధికం. రాహుల్ చేసిన 10 టెస్ట్ సెంచరీలలో 9 విదేశాల్లోనే రావడం విశేషం. దీంతో మొహిందర్ అమర్నాథ్, కెన్ బారింగ్టన్‌ల సెంచరీ రికార్డులను సమం చేశాడు. 

భారత్ 290/5 పరుగులు

నితీష్ కుమార్ రెడ్డి 13*

రవీంద్ర జడేజా 27*

 

06:21 PM (IST) Jul 12

లార్డ్స్ లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్

లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ పై కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు. 176 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు.  100 పరుగుల ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు బాదాడు. ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్ కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇది తనకు లార్డ్స్ లో రెండో సెంచరీ కాగా, టెస్టుల్లో 10వ సెంచరీ.

భారత్ 254/4 (67) పరుగులు

కేఎల్ రాహుల్ 100* పరుగులు

రవీంద్ర జడేజా 4* పరుగులు

 

 

05:33 PM (IST) Jul 12

రిషబ్ పంత్ అవుట్

రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. 74 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. 

భారత్ 248/4

కేఎల్ రాహుల్ 98 పరుగులు

05:00 PM (IST) Jul 12

సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రిషబ్ పంత్

లార్డ్స్ లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ కొట్టాడు. తన హాఫ్ సెంచరీని బెన్ స్టోక్స్ బౌలింగ్ లో సిక్సర్ తో పూర్తి చేశాడు. 86 బంతుల్లో 55 పరుగులతో ఆడుతున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.

భారత్ : 216/3

కేఎల్ రాహుల్ 85* పరుగులు

రిషబ్ పంత్ 55* పరుగులు

 

04:51 PM (IST) Jul 12

కేఎల్ రాహల్ ఆన్ ఫైర్

IND vs ENG Live Score, 3rd Test Match Day 3: రాహుల్ వరుస ఫోర్లు 

ఇంగ్లాండ్ పై కేఎల్ రాహుల్ ఫైర్ కొనసాగుతోంది. టీ బ్రేక్ కు ముందు బ్రైడన్ కార్స్ బౌలింగ్ లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 76* పరుగులతో ఆడుతున్నాడు. భారత్ 200 పరుగుల మార్కును అందుకుంది.

భారత్ : 206/3

కేఎల్ రాహుల్ 83* పరుగులు

రిషబ్ పంత్ 48* పరుగులు

 

 

04:44 PM (IST) Jul 12

దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రిషబ్ పంత్

లార్డ్స్ టెస్టులో మూడో భారత ఇన్నింగ్స్ రిషబ్ పంత్ డూకుడుగా మొదలుపెట్టాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి మూడో రోజు ఆడను పంత్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం పంత్ 46 పరుగులతో ఆడుతున్నాడు. 

భారత్ : 198/3

కేఎల్ రాహుల్ 77* పరుగులు

రిషబ్ పంత్ 46* పరుగులు

 

03:25 PM (IST) Jul 12

ఇండియా vs ఇంగ్లాండ్ 3వ రోజు అప్డేట్స్

లార్డ్స్ లో ఇండియా vs ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఇరు జట్లకు కీలకంగా మారనుంది.

  • జస్ప్రీత్ బుమ్రా మెరుపులు మెరిపించారు. బుమ్రా ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టారు. బెన్ స్టోక్స్, జో రూట్, క్రిస్ వోక్స్ వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేసి లార్డ్స్ ఆనర్స్ బోర్డ్‌పై తన పేరు లిఖించుకున్నాడు.
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ మొత్తంగా 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జో రూట్ అద్భుతంగా ఆడి సెంచరీ కొట్టాడు. ఇది లార్డ్స్‌లో ఆయన 8వ సెంచరీ కావడం విశేషం.
  • టీమిండియా బ్యాటింగ్ లో మొదట తడబడింది. కెప్టెన్ గిల్ (16), జైస్వాల్ (13), కరుణ్ నాయర్ (40) త్వరగా అవుట్ అయ్యారు.
  • జోఫ్రా ఆర్చర్ 2021 తర్వాత మళ్లీ టెస్ట్‌కు తిరిగివచ్చిన తర్వాత మొదటి మ్యాచ్‌లోనే తొలి ఓవర్‌లో వికెట్ తీశాడు. జైస్వాల్‌ను ఔట్ చేశాడు.
  • కేఎల్ రాహుల్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
  • రిషబ్ పంత్ (19*) కూడా గాయపడినప్పటికీ ధైర్యంగా ఆడుతూ మంచి భాగస్వామ్యాన్ని ఏర్పరచారు.
  • ఇండియా స్కోర్: 145/3 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగిస్తోంది. ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది.
  • మూడో రోజు రాహుల్, పంత్ ఇన్నింగ్స్ లపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.

More Trending News