India vs England 2nd Test Day 5 Live Update: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ తలపడుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు 5వ రోజు లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

09:46 PM (IST) Jul 06
India vs England: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ పై సూపర్ విక్టరీ కొట్టింది. 336 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్ 587 & 427/6 d
ఇంగ్లాండ్ 407 & 271
336 పరుగుల తేడాతో గెలిచిన భారత్
09:30 PM (IST) Jul 06
రవీంద్ర జడేజా జోష్ టంగ్ ను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 9వ వికెట్ కోల్పోయింది. 245/9 పరుగులతో ఆడుతోంది.
08:58 PM (IST) Jul 06
India vs England 2nd Test Day 5 Live: ఇంగ్లాండ్ 8వ వికెట్ కోల్పోయింది. జేమీ స్మిత్ అవుట్ అయ్యాడు. 88 పరుగుల వద్ద వుండగా ఆకాశ్ దీప్ అతన్ని అవుట్ చేశాడు.
ఇంగ్లాండ్ 231/8 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
08:10 PM (IST) Jul 06
IND vs ENG Live Score day 5: వరుసగా వికెట్లు కోల్సోయి ఓత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్ కోసం జేమీ స్మిత్ కీలక ఇన్నింగ్స్ ను ఆడాడు. హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆయన 72 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ 173/6
07:19 PM (IST) Jul 06
IND vs ENG Live Score Day 5: ఇంగ్లాండ్ జట్టు ఐదో రోజు లంచ్ బ్రేక్ సమయానికి స్కోరు 153/6 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంకా 455 పరుగులు కావాలి. భారత్ విజయానికి మరో నాలుగు వికెట్లు కావాలి.
లంచ్‌కు కొద్దిసేపటి ముందు భారత్‌కు వాషింగ్టన్ సుందర్ కీలక వికెట్ అందించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను 33 పరుగులు వద్ద ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ప్రస్తుతం జెమీ స్మిత్ క్రీజ్‌లో ఉన్నాడు.
ఇంగ్లాండ్ 153/6 (40.3 ఓవర్లు)
జేమీ స్మిత్ 32* పరుగులు
05:40 PM (IST) Jul 06
India vs England 2nd Test Day 5 Live : ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆకాశ్ దీప్ అద్భుతమైన బౌలింగ్ తో హ్యారీ బ్రూక్ ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. దీంతో భారత్ విజయానికి మరింత చేరువైంది. మరో ఐదు వికెట్లు తీస్తే భారత్ విజయం సాధిస్తుంది. హ్యారీ బ్రూక్ 23 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
ఇంగ్లాండ్ 87/5 (22 ఓవర్లు)
బెన్ స్టోక్స్ 3* పరుగులు
జేమీ స్మిత్ 4*
05:33 PM (IST) Jul 06
India vs England 2nd Test Day 5 Live : వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ ఆరంభంలోనే ఆకాశ్ దీప్ భారత్ కు బ్రేక్‌త్రూ అందించాడు. ఐదో రోజు తొలి వికెట్ గా ఓలీ పోప్ ను అవుట్ చేశాడు. ఓలీపోప్ 24 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. భారత్ విజయానికి మరో 6 వికెట్లు కావాలి.
ఇంగ్లాండ్ 82/4 (19.5 ఓవర్లు)
హ్యారీ బ్రూక్ 23* పరుగులు
బెన్ స్టోక్స్ 2* పరుగులు
05:23 PM (IST) Jul 06
Most Runs Against India: భారత జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో కొంత మంది వికెట్ కీపర్లు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. వారి జట్టుకు తిరుగులేని విజయాలు అందించారు. వారి మ్యాచ్ లను కోల్పోయిన పలువురు వికెట్ కీపర్లు క్రికెట్ చరిత్రలో నిలిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. వారిలో ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ జేమీ స్మిత్ కూడా ఉన్నారు. టీమిండియా తో జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 వికెట్ కీపర్ల ప్రదర్శనల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
04:12 PM (IST) Jul 06
India vs England 2nd Test Day 5 Live : ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంకా తేలికపాటి జల్లులు పడుతున్నాయి. వర్షం చాలా పెద్దగా అయితే లేదు, కానీ కవర్లను తొలగించడానికి మరింత సమయం పట్టేలా ఉంది. భారత జట్టుకు ఇది నిరాశను కలిగించే విషయం.
03:34 PM (IST) Jul 06
India vs England 2nd Test Day 5 Live : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో మొత్తం 430 పరుగులు చేసి, టెస్టు చరిత్రలో గ్రాహమ్ గూచ్ (456 రన్స్) తర్వాత రెండో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
తొలి ఇన్నింగ్స్ భారత్ 587 రన్స్, 2వ ఇన్నింగ్స్ లో 427/6 వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్‌కు 608 పరుగుల లక్ష్యం ఉంచింది. గిల్ 250+, 150+ స్కోర్లు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. గవాస్కర్ తర్వాత 200+, 100+ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.
పంత్ (65), రాహుల్ (55), జడేజా (69*) రాణించాడు. సిరాజ్, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో మెరిపించారు. నాలుగో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 72/3 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కు ఇంకా 536 రన్స్ అవసరం. భారత్ విజయానికి 7 వికెట్లు కావాలి. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అవుతోంది.
03:20 PM (IST) Jul 06
India vs England 2nd Test Day 5 Live: నాల్గో రోజు ఆటను ఇంగ్లాండ్ జట్టు 72/3 పరుగులతో ముగించింది. గెలవడానికి ఇంకా 536 పరుగులు అవసరం. భారత్ 608 పరుగుల టార్గెట్ ను ఉంచింది. భారత్ మరో 7 వికెట్లు తీస్తే విజయం అందుకుంటుంది. అయితే, 5వ రోజు మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుంది.
క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్:
• హ్యారీ బ్రుక్: 15 పరుగులు
• ఓలీ పోప్: 24 పరుగులు
భారత బౌలింగ్:
• ఆకాష్ దీప్: 2 వికెట్లు
• మహ్మద్ సిరాజ్: 1 వికెట్