Published : Sep 24, 2025, 06:46 PM ISTUpdated : Sep 25, 2025, 12:01 AM IST

Asia Cup 2025, IND vs BAN Live : ఆసియా కప్ 2025 ఇండియా vs బంగ్లాదేశ్ లైవ్ అప్డేట్స్

సారాంశం

Asia Cup 2025, IND vs BAN Live: ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా బుధవారం భారత్ vs బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లైవ్ స్కోర్, తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

India vs Bangladesh Asia Cup 2025 Super Fours IND vs BAN

12:01 AM (IST) Sep 25

భారత్ గెలుపు

భారత్ బంగ్లాపై విజయం సాధించింది. 41 పరుగులతో గెలిచింది. ఈ విజయంతో ఆసియా కప్ 2025 ఫైనల్ కు చేరింది. 

IND 168/6 (20)

BAN 127 (19.3)

 

 

10:56 PM (IST) Sep 24

వరుణ్ బౌలింగ్‌లో షమీమ్ అవుట్

షమీమ్ హుస్సేన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. స్ట్రెయిట్ డెలివరీని సరిగా అంచనా వేయలేకపోయాడు, దాంతో బంతి నేరుగా స్టంప్స్‌ను తాకింది. 

BAN 85/4 (12) CRR: 7.08 REQ: 10.5

 

10:50 PM (IST) Sep 24

మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 67/3

బంగ్లాదేశ్ మూడో వికెట్ ను కోల్పోయింది. హ్రిదోయ్ 7 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్ లో అభిషేక్ శర్మకు చిక్కాడు. బ

బంగ్లాదేశ్ 67/3

10:37 PM (IST) Sep 24

ఇమాన్ అవుట్.. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ రెండో వికెట్ ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ తో ఇమాన్ (21 పరుగులు) అభిషేక్ శర్మకు క్యాచ్ రూపంలో చిక్కాడు. 

BAN 49/2 (7) CRR: 7 REQ: 9.23

 

10:28 PM (IST) Sep 24

5 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ 35/1

ఐదు ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. 

క్రీజులో సైఫ్ 19 పరుగులు, ఇమాన్ 10 పరుగులతో ఆడుతున్నారు.

BAN 35/1 (5) CRR: 7 REQ: 8.93

 

 

09:43 PM (IST) Sep 24

ముగిసిన భారత్ ఇన్నింగ్స్

భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 169 పరుగుల టార్గెట్ ను ఉంచింది.

09:21 PM (IST) Sep 24

తిలక్ వర్మ ఔట్

భారత్ 5వ వికెట్ కోల్పోయింది. తిలక్ వర్మ (5) అవుట్ అయ్యాడు. 

IND 135/5 (16) CRR: 8.44

 

 

09:04 PM (IST) Sep 24

కెప్టెన్ సూర్య కుమార్ అవుట్

భారత్ నాల్గో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 5 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

IND 114/4 (12) CRR: 9.5

 

09:02 PM (IST) Sep 24

భారత్ మూడో వికెట్ డౌన్.. అభిషేక్ శర్మ అవుట్

భారత్ మూడో వికెట్ ను కోల్పోయింది. అభిషేక్ శర్మ 75 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. 

IND 114/3 (11.5) CRR: 9.63

 

08:50 PM (IST) Sep 24

10 ఓవర్ల తర్వాత భారత్ 96/2 (10) CRR: 9.6

10 ఓవర్ల తర్వాత భారత్ రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. 

 

IND 96/2 (10) CRR: 9.6

అభిషేక్ శర్మ 60* రన్స్ 

సూర్య కుమార్ 3* రన్స్ 

 

08:42 PM (IST) Sep 24

రెండో వికెట్ కోల్పోయిన భారత్.. దూబే అవుట్

భారత్ రెండో వికెట్ కోల్పోయింది. దూబే 2 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

IND 83/2 (8.2) CRR: 9.96

 

08:41 PM (IST) Sep 24

హాఫ్ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ

భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 50 పరుగుల తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.

IND 83/1 (8) CRR: 10.38

 

08:34 PM (IST) Sep 24

గిల్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. గిల్ 29 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

IND 77/1 (6.2) CRR: 12.16

 

08:33 PM (IST) Sep 24

పవర్ ప్లే తర్వాత భారత్ 72/0 (6) CRR: 12

బంగ్లా బౌలింగ్ ను భారత ఓపెనర్లు దంచికొడుతున్నాడు. అభిషేక్, గిల్ వరుస బౌండరీలతో అదరగొడుతున్నారు. పవర్ ప్లే తర్వాత భారత్ 72 పరుగులు చేసింది. ఈ టోర్నీలో అత్యధిక పవర్ ప్లే స్కోర్ ఇది. 

IND 72/0 (6) CRR: 12

 

08:27 PM (IST) Sep 24

దూకుడు పెంచిన గిల్, అభిషేక్

భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ దూకుడుగా ఆడుతున్నారు. అద్భుతమైన షాట్లతో అదరగొడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత భారత్ 55 పరుగులు చేసింది. 

 

IND 55/0 (5) CRR: 11

అభిషేక్ శర్మ 30* పరుగులు

గిల్ 24* పరుగులు 

07:59 PM (IST) Sep 24

సూర్య కుమార్ యాదవ్ ఏమన్నారంటే?

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పిచ్ చాలా బాగుంది అని అనిపిస్తోంది. మేము 14న (పాకిస్తాన్‌తో) ఇక్కడ ఆడినప్పటి విషయాన్ని చూడాలి, ఆ రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ కొంచెం నెమ్మదిగా మారింది. అందువల్ల మేము మొదట బ్యాటింగ్ చేయడం గురించి చాలా సంతోషంగా ఉన్నాం. అదే సమయంలో, గత కొన్ని మ్యాచ్‌లలో చేసిన అన్ని మంచి పనులను కొనసాగించాలి. ఫలితం నుకూలంగా వస్తుందనీ, కేవలం దానిపై ఫోకస్ చేస్తున్నాం.  బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాలూ బలంగా ఉన్నాయి. డ్రాప్ చేసిన క్యాచ్‌లు ఆటలో భాగమే.  జట్టులో మార్పులు లేవు" అని తెలిపారు. 

బంగ్లా కెప్టెన్ జాకర్ అలీ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. లిట్టన్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు, దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమైన మ్యాచ్‌ను మిస్ అవుతున్నారు. నేను ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. మేము జట్టుగా చాలా బాగున్నాం, మేము బా బెస్ట్ ఇస్తాము.  బ్యాటింగ్ కోసం పిచ్ బాగుంది. నాలుగు మార్పులతో బరిలోకి దిగుతున్నాము" అని చెప్పారు.

 

07:51 PM (IST) Sep 24

లిటన్ దాస్ మ్యాచ్ నుంచి అవుట్

బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ వెన్ను గాయం కారణంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కు జకీర్ అలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

 

07:50 PM (IST) Sep 24

ఇండియా vs బంగ్లాదేశ్: ప్లేయింగ్ 11

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): సైఫ్ హసన్, తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హ్రిదోయ్, షమీమ్ హుస్సేన్, జాకర్ అలీ (వికెట్ కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ షకిబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్.

07:49 PM (IST) Sep 24

టాస్ ఓడిన భారత్

బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. కెప్టెన్ జాకర్ అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. 

06:56 PM (IST) Sep 24

ఆసియా కప్ లో టీమిండియా జైత్రయాత్ర

ఆసియా కప్ 2025లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోలేదు. భారత జట్టు వరుసగా మ్యాచ్‌లు గెలుచుకుంది. ఇప్పుడు సూపర్-4లో రెండో మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రాత్రి 8 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.  సూపర్-4లో ఇరు జట్లూ విజయంతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించగా, బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను ఓడించింది. ఇప్పుడు ఫైనల్ కోసం ఈ మ్యాచ్ ఇరు జట్లకూ చాలా కీలకం.


More Trending News