ముగిసిన తొలి రోజు ఆట: ఉస్మాన్ ఖవాజా సెంచరీ... ఆస్ట్రేలియాదే ఆధిక్యం, భారీ స్కోరు దిశగా పరుగు...

Published : Mar 09, 2023, 04:43 PM IST
ముగిసిన తొలి రోజు ఆట: ఉస్మాన్ ఖవాజా సెంచరీ... ఆస్ట్రేలియాదే ఆధిక్యం, భారీ స్కోరు దిశగా పరుగు...

సారాంశం

అహ్మదాబాద్ టెస్టు: తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... అజేయ సెంచరీతో క్రీజులో ఉస్మాన్ ఖవాజా, హాఫ్ సెంచరీ చేరువలో కామెరూన్ గ్రీన్.. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగుల స్కోరు చేసింది ఆస్ట్రేలియా. చేతిలో ఇంకా 6 వికెట్లు ఉండడం, పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తుండడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 350-400 స్కోరు చేసేలా కనిపిస్తోంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 251 బంతుల్లో 15 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకోగా అతనితో కలిసి ఐదో వికెట్‌కి అజేయంగా 70 పరుగుల భాగస్వామ్యం జోడించిన కామెరూన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు...


టాస్ గెలిచిన స్టీవ్ స్మిత్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన క్యాచులను భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఒడిసిపట్టలేకపోయాడు. తొలి వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. 44 బంతుల్లో 7 ఫోర్లతో 32 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 20 బంతుల్లో 3 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ కలిసి ఆస్ట్రేలియాని ఆదుకున్నారు. తొలి రోజు మొదటి సెషన్ ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, రెండో సెషన్‌లో భారత బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యింది..

ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ... ఇలా బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా టీమిండియాకి ఫలితం దక్కలేదు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఫోర్ బాది, 146 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఉస్మాన్ ఖవాజా.. అతనికి ఇది టెస్టుల్లో 22వ హాఫ్ సెంచరీ కాగా ఈ సిరీస్‌లో మూడోది...

 రెండో సెషన్‌లో వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా. అయితే టీ బ్రేక్ ముగిసిన తర్వాత స్టీవ్ స్మిత్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు రవీంద్ర జడేజా. 135 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, జడ్డూ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడం ఇది నాలుగోసారి.

ఆ తర్వాత 27 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.. 170 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. క్రీజులోకి వస్తూనే దూకుడుగా ఆడిన కామెరూన్ గ్రీన్, ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఐదో వికెట్‌కి 116 బంతుల్లోనే అజేయంగా 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

కామెరూన్ గ్రీన్ 64 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేయగా ఉస్మాన్ ఖవాజా 251 బంతుల్లో 15 ఫోర్లతో 104 పరుగులు ఈ సిరీస్‌లో తొలి సెంచరీ బాదిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు.. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !