
సౌతాఫ్రికాలో సెంచూరియన్ టెస్టు గెలిచి, 2021 ఏడాదిని విజయంతో ముగించిన భారత జట్టు... టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే... ఈ సిరీస్‌కి జట్టును ప్రకటించింది బీసీసీఐ. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు గాయపడిన రోహిత్ శర్మ, వన్డే సిరీస్ సమయానికి కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసినా... అతని గాయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మను ఎంపిక చేసి, రిస్క్ చేయడం ఇష్టం లేక... ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ, ఈ సిరీస్‌కి కెఎల్ రాహుల్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంచుకుంది. రోహిత్ శర్మ గైర్హజరీతో టెస్టు ఫార్మాట్‌కి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కెఎల్ రాహుల్, ఆ సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్‌కి సారథిగా వ్యవహరించబోతున్నాడు.
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అతను వన్డే సిరీస్‌కి అందుబాటులో ఉన్నప్పటికీ సారథ్య బాధ్యతలు అప్పగించని సెలక్టర్లు, భవిష్యత్ సారథిగా అంచనా వేస్తున్న కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగించింది...
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌కి వన్డే సిరీస్‌కి పిలుపు దక్కింది. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాని వైస్ కెప్టెన్‌గా ఎంచుకున్నారు సెలక్టర్లు. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లకు ఈ వన్డే సిరీస్‌లో చోటు దక్కగా వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఎంచుకున్నారు సెలక్టర్లు...
విజయ్ హాజారే ట్రోఫీలో అదరగొట్టిన రిషి ధావన్‌కి వన్డే సిరీస్‌లో అవకాశం వస్తుందని ఆశలు రేగినా, సెలక్టర్లు అతనికి మరోసారి మొండిచేయి చూపించారు. యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు రవిచంద్రన్ అశ్విన్... వన్డే ఫార్మాట్‌లోకి నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్నాడు...
బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకేూర్, మహ్మద్ సిరాజ్‌లకు పేసర్లుగా జట్టులో చోటు దక్కగా, మహ్మద్ షమీకి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...
ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాని వన్డే సిరీస్‌కి ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా... పూర్తి ఫిట్‌నెస్ సాధించేవరకూ అతను సెలక్షన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
రోహిత్ శర్మ కెప్టెన్సీ విరాట్ కోహ్లీ ఆడడాన్ని చూడాలని ఆశపడిన అభిమానులకు ఈ సారి కూడా నిరాశ తప్పలేదు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరంగా ఉండగా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అయినా ఈ ఇద్దరూ ఆడతారో లేదో చూడాలి.
వన్డే సిరీస్‌కి భారత జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్