IND vs SA: లోపాలను సరిదిద్దుకోడానికి ఆఖరి ఛాన్స్.. సౌతాఫ్రికాతో తొలి టీ20లో టాస్ నెగ్గిన టీమిండియా

By Srinivas MFirst Published Sep 28, 2022, 6:40 PM IST
Highlights

IND vs SA T20I: పొట్టి ప్రపంచకప్ కు ముందు  టీమిండియా ఆడుతున్న చివరి టీ20 సిరీస్ ఇది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌లు ముగిసిన వెంటనే రోహిత్ సేన ఆస్ట్రేలియా విమానమెక్కనుంది. లోపాలను సరిదిద్దుకోవడానికి  టీమిండియాకు ఇదే ఆఖరి అవకాశం.

ఇటీవలే కంగారూల కథ ముగించి  మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో దక్కించుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడు సఫారీల పని పట్టేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ కు ముందు  రోహిత్ సేన ఆడనున్న చివరి సిరీస్ ఇదే. అక్టోబర్ 5న ఇండోర్ లో మూడో మ్యాచ్ ముగిసిన వెంటనే  ప్రపంచకప్ కు ఎంపికైన జట్టు ఆస్ట్రేలియా విమానమెక్కనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్ కు భారత్ కు కీలకం.  బౌలింగ్ లోపాలను సరిదిద్దుకోవడానికి కూడా టీమిండియాకు ఇదే ఆఖరి ఛాన్స్.  తిరువనంతపురంలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. 

ఈ సిరీస్ కు హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ కు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు  షమీ, దీపక్ హుడా కూడా అందుబాటులో లేరు. దీంతో  ఆసీస్ తో చివరి మ్యాచ్ తో ఆడిన తుది జట్టులో పలు మార్పులు జరిగాయి.   హార్ధిక్, భువీల స్థానంలో  అర్ష్‌దీప్ సింగ్, రిషభ్ పంత్ లు తుది జట్టులో చేరారు.

అంతేగాక బుమ్రా కూడా ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. అతడి స్థానంలో  దీపక్ చాహర్ తుది జట్టుతో చేరగా.. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో అశ్విన్ ఆడుతున్నారు. 

దానిమీదే దృష్టి.. 

గత కొంతకాలంగా టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య బౌలింగ్. ఆసియా కప్ నుంచి భారత బౌలింగ్ గాడి తప్పంది. ఆస్ట్రేలియా సిరీస్ లో మూడు మ్యాచ్ లలో అది మరింత పెరిగింది. డెత్ ఓవర్లలో భారత్ దారుణంగా విఫలమవుతున్నది.  అయితే రెండు నెలల గాయం తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా, హర్షల్ ఇంకా పాత ఫామ్ ను అందుకోలేదు. ఈ మ్యాచ్ లో బుమ్రా ఆడటం లేదు. కానీ హర్షల్,  ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడలేకపోయిన అర్ష్‌దీప్ సింగ్  ఈ మ్యాచ్ తో తిరిగి జట్టుతో రాణించడం భారత్ కు ముఖ్యం. దీపక్ చాహర్ కూడా బుమ్రా స్థానంలో వచ్చాడు. స్పిన్నర్లలో అశ్విన్, అక్షర్ లు ఏ మాయ చేస్తారో వేచి చూడాలి. 

 

Rohit Sharma has won the toss and will be fielding first.

Starting XI for the series opener. 🔥 pic.twitter.com/cjItatO29c

— Royal Challengers Bangalore (@RCBTweets)

తుది జట్లు : 

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ఖ పటేల్, హర్షల్ పటేల్, అశ్విన్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ 

సౌతాఫ్రికా :  టెంబ బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రిలీ రూసో, మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కగిసొ రబాడా, షంషీ, కేశవ్ మహారాజ్,  అన్రిచ్ నోర్త్జ్ 

click me!