INDvsENG: తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకి ఇంగ్లాండ్ ఆలౌట్... అశ్విన్ రికార్డు స్పెల్...

By team teluguFirst Published Feb 7, 2021, 10:20 AM IST
Highlights

 55.1 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్...

190.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు...

ఆసియా ఖండంలో 300 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్...

ఓవర్‌నైట్ స్కోరు 555/8 వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 23 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. డొమినిక్ బెస్ 105 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేయగా, జాక్ లీచ్ 57 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డొమినిక్ బేస్‌ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా, జేమ్స్ అండర్సన్‌ను రవిచంద్రన్ అశ్విన్ బౌల్డ్ చేశాడు.

మూడో రోజు 10.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్. రవిచంద్రన్ అశ్విన్ 55.1 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. అశ్విన్ కెరీర్‌లో ఇన్ని ఓవర్లు బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. బుమ్రా మూడు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీయగా షాబజ్ నదీమ్‌కి 2 వికెట్లు దక్కాయి.

రవిచంద్రన్ అశ్విన్ ఆసియా ఖండంలో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 2004లో సౌతాఫ్రికా తర్వాత భారత్‌లో టీమిండియాపై ఇన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన మొదటి జట్టుగా నిలిచింది ఇంగ్లాండ్. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 218 పరుగులు చేయగా సిబ్లీ 87, బెన్ స్టోక్స్ 82 పరుగులు చేశారు. 

click me!