INDvsAUS: భారీ లక్ష్యచేధనలో ‘ఛేజింగ్ కింగ్’ కోహ్లీ అవుట్... కష్టాల్లో టీమిండియా...

By team teluguFirst Published Nov 27, 2020, 2:57 PM IST
Highlights

80 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అవుట్...

మూడు వికెట్లు తీసిన జోష్ హజల్‌వుడ్...

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 375 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ కలిసి మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు దూకుడు ఆడడంతో 5.2 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది టీమిండియా.

18 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 22 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ వస్తూనే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 21 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. అయితే హజల్‌వుడ్ బౌలింగ్‌లో కోహ్లీ అవుట్ కావడంతో భారత జట్టు కష్టాల్లో పడింది.

1 పరుగు వద్ద ఆడమ్ జంపా క్యాచ్ జారవిరచడంతో బతికిపోయిన విరాట్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడకుండానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండు బంతులకే శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. 80 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.

టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లను హజల్‌వుడ్ తీయడం విశేషం. ఇప్పుడు టీమిండియా గెలవాలంటే క్రీజులో ఉన్న శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాల్సిందే. 

click me!