Shane Warne: ఇంగ్లాండ్ కు ‘బూడిద’ను కూడా మిగల్చని ఘనుడతడు.. ఇప్పటికీ యాషెస్ లో రికార్డు వార్న్ పేరిటే..

Published : Mar 05, 2022, 09:31 AM ISTUpdated : Mar 05, 2022, 09:36 AM IST
Shane Warne: ఇంగ్లాండ్ కు ‘బూడిద’ను కూడా మిగల్చని ఘనుడతడు.. ఇప్పటికీ యాషెస్ లో రికార్డు వార్న్ పేరిటే..

సారాంశం

Shane Warne Passes Away: రెండేండ్లకోసారి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ దేశాలు కలిసి స్టేడియాలలొ కొట్టుకునే సిరీస్ యాషెస్.. బూడిద కోసం జరిగే ఈ పోరాటం లో ఆధిపత్యం  చేతులు మారుతూ ఉంటుంది. కానీ వార్న్ ఉన్నంతకాలం వార్ వన్ సైడే అయింది. 

లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు తీరని లోటు. ముఖ్యంగా ఆసీస్ జట్టుకు ఇది కోలుకోలేని సమయం.  ఒకేరోజు ఆ జట్టు ఇద్దరు దిగ్గజాలను కోల్పోయింది. అయితే  తన కెరీర్ లో వందలాది రికార్డులు నెలకొల్పిన వార్న్ కు ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాలు రెండేండ్లకోసారి కొట్టుకునే ‘యాషెస్’ అంటే మహా సరదా. ఎంత సరదా అంటే..  తాను క్రికెట్ ఆడినంత కాలం ఇంగ్లాండ్ ను తమ దేశం నుంచి ‘బూడిద’ (యాషెస్ ను ఇలాగే పరిగణిస్తారు) ను కూడా తీసుకుపోనియలేదంటే అతడి  ఘనతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ యాషెస్ లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత షేన్ వార్న్ దే.. 

వార్న్ దెబ్బకు.. 1993 నుంచి 2005 దాకా ఇంగ్లాండ్ యాషెస్ నెగ్గలేదు.  పుష్కర కాలం పాటు.. 12 ఏండ్ల దాకా ఇంగ్లాండ్ కు ఆస్ట్రేలియా తో పాటు స్వదేశంలో కూడా భంగపాటే..  చివరికి 2005లో కిందా మీదా పడి సాధించినా.. ఈ సిరీస్ లో కూడా  స్పిన్ దిగ్గజం  5 టెస్టులలో 40 వికెట్లతో చెలరేగాడు. 

 

ఇంగ్లాండ్ మీద  మొత్తంగా 36 టెస్టులాడాడు వార్న్. తన కెరీర్ లో అత్యధిక టెస్టులు ఆడింది ఈ దేశం మీదే.. ఈ సుదీర్ఘ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ మీద ఏకంగా 195 వికెట్లు పడగొట్టాడు. యాషెస్ లో అత్యధిక వికెట్ల రికార్డు వార్న్ పేరిటే ఉంది.  యాషెస్ లో ఇంగ్లాండ్ పై ఏకంగా 1792.5 ఓవర్లు బౌలింగ్ చేసిన వార్న్.. 488 మెయిడిన్లు వేశాడు.  23.25 సగటుతో 195 వికెట్లు పడగొట్టడమే గాక.. 11 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. మ్యాచులో  పది వికెట్ల ప్రదర్శన నాలుగు సార్లు చేశాడు.  మొత్తంగా అత్యుత్తమ ప్రదర్శన 8-71 గా ఉంది. 

 

గ్లెన్ మెక్ గ్రాత్, జాసన్ గిలెస్పీ, బ్రెట్ లీ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లను అందించిన ఆసీస్ నుంచి ప్రపంచాన్ని శాసించే  లెగ్ స్పిన్నర్ రావడమే గొప్ప అంటే.. అతడు సాధించిన రికార్డులు వార్న్ ను టాప్ లో నిలిపాయి.  ఇంగ్లాండ్ మీదే కాదు.. క్రికెట్ ఆడే అన్ని దేశాలపై వార్న్ ఆధిపత్యం సాగించాడు.ఒకరకంగా.. 90వ, 2000 దశకంలో  ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఏకఛత్రాదిపత్యంగా ఏలిందంటే దానికి కారణం వార్న్ అని  చెప్పడంలో  సందేహామేమీ లేదు. 
 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !