విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సామాజిక ‘SeVVA’... స్వచ్ఛంద సంస్థను ప్రకటించిన సెలబ్రిటీ కపుల్...

Published : Mar 24, 2023, 11:27 AM IST
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సామాజిక ‘SeVVA’... స్వచ్ఛంద సంస్థను ప్రకటించిన సెలబ్రిటీ కపుల్...

సారాంశం

Se అంటే సెల్ఫ్, V అంటే విరాట్, V అంటే వామిక, A అంటే అనుష్క.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫౌండేషన్‌లను కలుపుతూ ‘SeVVA’ పేరుతో కొత్త ఫౌండేషన్‌ని స్థాపించిన సెలబ్రిటీ కపుల్.. 

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కలిసి ఓ కొత్త స్వచ్ఛంద సంస్థను ప్రకటించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, కోహ్లీ ఫౌండేషన్ పేరుతో, అనుష్క శర్మ, అనుష్క శర్మ ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవాళ్లు. ఇప్పుడు ఈ రెండు ఫౌండేషన్లను కలుపుతూ ‘SEVVA’ పేరుతో ఓ కొత్త స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు...

‘SeVVA’ను సగర్వంగా మీ ముందుకు తెలుస్తున్నాం. ఇది మా ఇద్దరి కలయికతో వస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ. Se అంటే సెల్ఫ్, V అంటే విరాట్, V అంటే వామిక, A అంటే అనుష్క.. కుటుంబంగా కలిసి సమాజానికి వీలైనంత సేవ, సాయం కోసం ఎదురుచూసేవాళ్లకు చేతనైనంత సహాయం అందించడంతే ఈ SeVVA లక్ష్యం’... అంటూ ప్రకటించింది బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ...

అనుష్క శర్మ సోషల్ మీడియా పోస్టు ద్వారా ‘SeVVA’ సంస్థ వీడియోను పోస్ట్ చేసింది.. ‘కహ్లీల్ గిబ్రాన్ చెప్పిన మాటల ప్రకారం ‘మీరు మీ ఆస్తులను ఇచ్చినప్పుడు కొంచెం మాత్రమే ఇస్తారు. అదే మీ నుంచి ఏదైనా ఇచ్చినప్పుడు పూర్తిగా, నిజంగా ఇస్తారు.. ప్రాణం ఇచ్చేది జీవితం. దాతగా ఇచ్చే మీరు సాక్షిగా మాత్రమే నిలుస్తారు..’ అంటూ కాప్షన్ జోడించింది అనుష్క శర్మ...


‘నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే పరుల సేవకు నిన్ను అర్పించు’ అంటూ మహాత్మా గాంధీ చెప్పిన కొటేషన్‌ని వీడియోలో జోడించింది అనుష్క శర్మ. 

‘సేవా ద్వారా భవిష్యత్తులో పిల్లలకు స్కాలర్‌షిప్స్ ఇవ్వడంతో పాటు టాలెంట్ ఉన్న వారిని గుర్తించి వాళ్లు క్రీడల్లో రాణించేందుకు అవసరమైన సహాయాన్ని, సదుపాయాలను కల్పించాలని అనుకుంటున్నాం... దీనికి మీ అందరి తోడ్పాటు కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ..

ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక యాత్రల్లో ఎక్కువగా పాల్గొంటున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... SeVVA స్వచ్ఛంద సంస్థను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. విరుష్క కూతురు వామిక కోహ్లీని మీడియాకి దూరంగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఇప్పటి దాకా ఆమెకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయలేదు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. 

ఎప్పుడైనా కూతురితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా ముఖం కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, ఐపీఎల్ 2023 సీజన్‌లో పాల్గొనబోతుంటే, అనుష్క శర్మ బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !