T20 World Cup 2022: అనుకోకుండా టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులోకి వచ్చి ఏకంగా ఫైనల్ కూడా ఆడబోతున్న పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచకప్ లో వరుసగా రెండు మ్యాచ్ లో ఓడి తర్వాత నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లను ఓడించి అదృష్టం కొద్దీ సెమీస్ చేరిన పాకిస్తాన్.. ఈనెల 13న ఇంగ్లాండ్ తో మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఫైనల్ లో తలపడబోతుంది. ఇప్పటికే మెల్‌బోర్న్ చేరుకున్న పాకిస్తాన్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. పాక్ సారథి బాబర్ ఆజమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్ లో అతడు పాకిస్తాన్ ప్రధాని అవుతాడని సన్నీ జోస్యం చెప్పాడు.
ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్ కు చేరడంతో ఆ జట్టు ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. 1999 వన్డే ప్రపంచకప్ లో కూడా అచ్చం ఈ టోర్నీలో జరుగుతున్నట్టుగానే జరిగిందని.. దీంతో ఈసారి చరిత్ర పునరావృతం ఖాయమని అంచనాలు కడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ తర్వాత తమకు బాబర్ ఆజమ్ మరో ఐసీసీ టోర్నీ అందివ్వబోతున్నాడని విశ్లేషణలు చేస్తున్నారు.
undefined
ఈ నేపథ్యంలో గవాస్కర్ ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చరిత్ర పునరావృతమై.. మెల్‌బోర్న్ లో ఇంగ్లాండ్ ను పాకిస్తాన్ ఓడించి ట్రోఫీ దక్కించుకుంటే గనక పాక్ సారథి బాబర్ ఆజమ్ 2048 లో పాకిస్తాన్ ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు. గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఫైనల్లో ఇంగ్లాండ్ గనక ఓడి పాకిస్తాన్ ట్రోఫీ దక్కించుకుంటే 2048 లో బాబర్ ఆజమ్ పాకిస్తాన్ ప్రధాని అవుతాడు..’ అని జోస్యం చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న షేన్ వాట్సన్, ఇతరుల మోముల్లో నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
1992లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కు తొలి ఐసీసీ ట్రోఫీని అందించాడు. ఆ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్.. 1996లో పాకిస్తాన్ తెహ్రీక్ -ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) ని స్థాపించాడు. పార్టీ పెట్టిన 22 ఏండ్ల తర్వాత 2018 ఆగస్టులో ఆయన పాకిస్తాన్ కు 22వ ప్రధానిగా ఎన్నికయ్యారు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Just like 1992, it’s vs in a final at the MCG! 🇵🇰🏴 pic.twitter.com/jvojJmEL7V
— Imran Katoch (@ImranKatoch955)