ICC World cup 2023: పోరాడి ఓడిన శ్రీలంక! సౌతాఫ్రికా ఘన విజయం...

వన్డే వరల్డ్ కప్ 2023: 326 పరుగులకి ఆలౌట్ అయిన శ్రీలంక... 102 పరుగుల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా.. హాఫ్ సెంచరీలతో పోరాడిన కుసాల్ మెండిస్, చరిత్ అసలంక, దసున్ శనక.. 


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సౌతాఫ్రికా బోణీ కొట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది దక్షిణాఫ్రికా. భారీ లక్ష్యఛేదనలో కుసాల్ మెండిస్, చరిత్ అసలంక, దసున్ శనక హాఫ్ సెంచరీలతో పోరాడినా.. శ్రీలంకకి విజయాన్ని  మాత్రం అందించలేకపోయారు. 44.5 ఓవర్లలో శ్రీలంక 326 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

 పథుమ్ నిశ్శంక డకౌట్ కావడంతో 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది శ్రీలంక. అయితే కుసాల్ మెండిస్, ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కుసాల్ పెరేరా 15 బంతుల్లో 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 7 పరుగులు చేసిన కుసాల్ పెరేరాతో కలిసి మెండిస్‌తో  60 పరుగులు జోడించాడు.

Latest Videos

 కుసాల్ మెండిస్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన సధీర సమరవిక్రమ కూడా గెరాల్డ్ కోట్జీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చరిత్ అసలంక 65 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి, లుంగి ఎంగిడి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

ధనంజయ డి సిల్వ 11 పరుగులు చేయగా దునిత్ వెల్లలాగే డకౌట్ అయ్యాడు. 62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసిన దసున్ శనక, కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేయగా మతీశ పథిరాణా 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 428 పరుగుల భారీ స్కోరు చేసింది. 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, మతీశ పథిరాణా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.. హెన్రీచ్ క్లాసిన్ 20 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగుల చేసి రజిత బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

49 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ బాదిన అయిడిన్ మార్క్‌రమ్, వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇంతకుముందు 2011లో ఇంగ్లాండ్‌పై 50 బంతుల్లో సెంచరీ చేసిన కెవిన్ ఓబెయ్రిన్, వన్డే వరల్డ్ కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు...

వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి కాగా వరల్డ్ కప్‌లో మొదటిసారి. మొత్తంగా నాలుగు సార్లలో మూడు సార్లు సౌతాఫ్రికానే ఈ ఫీట్ సాధించడం విశేషం.. 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, మధుశనక బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

click me!