ఇండియా-ఐర్లాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి.. డక్‌వర్త్ లూయిస్ వస్తే విజేత ఎవరంటే..

Published : Feb 20, 2023, 09:05 PM ISTUpdated : Feb 20, 2023, 09:18 PM IST
ఇండియా-ఐర్లాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి..  డక్‌వర్త్ లూయిస్  వస్తే విజేత ఎవరంటే..

సారాంశం

ICC Womens T20 World Cup 2023:  మహిళల ప్రపంచకప్ లో భాగంగా దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఇండియా-ఐర్లాండ్  మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది.   

ఇండియా  - ఐర్లాండ్ మధ్య  దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది.  ఐర్లాండ్  బ్యాటింగ్ చేస్తుండగా  8వ ఓవర్ రెండో బంతి వేశాక  తీవ్ర గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ను అర్థాంతరంగా ఆపేశారు నిర్వాహకులు.   ప్రస్తుతం ఐర్లాండ్.. 8.2 ఓవర్లలో  54 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టుకు 70 బంతుల్లో 102 పరుగులు కావాలి. 

గ్రౌండ్ లో ఎండ కాస్తున్నా  ఉన్నట్టుండి  గాలులతో కూడిన వర్షం  ముంచెత్తింది. దీంతో ఆటగాళ్లు హుటాహుటిన  మైదానాన్ని వీడారు.  ఒకవేళ వర్షం  ఆగకుంటే  డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని అమల్లోకి తెస్తారు. 

డీఎల్ఎస్ ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో భారత్  దే విజయం కానుంది.  డీఎల్ఎస్ ప్రకారం ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సి ఉండగా ఆ జట్టు  54 పరుగుల వద్దే ఆగిపోయింది. విజయానికి మరో ఐదు పరుగుల దూరంలో నిలిచింది.  మరి  వర్షం వెలిస్తే మ్యాచ్ ను కొనసాగిస్తారా...?  మ్యాచ టైమ్ లోపల వాన  ఆగకుంటే   ఓవర్లను తగ్గించి ఆడిస్తారా..? అన్నది త్వరలోనే తేలనుంది.   

 

కాగా మోస్తారు లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. రేణుకా సింగ్ ఠాకూర్ వేసిన తొలి ఓవర్లో   మొదటి బంతికి అమీ హంటర్  కవర్ పాయింట్ దిశగా  డ్రైవ్ చేసింది.  తొలి పరుగు అవలీలగా తీసిన  హంటర్ రెండో పరుగు తీసే యత్నంలో రనౌట్ అయింది. జెమీమా  రోడ్రిగ్స్ సూపర్ త్రో తో ఆమె రనౌట్ గా వెనుదిరిగింది. ఇదే ఓవర్లో ఐదో బంతికి రేణకా .. ప్రెండర్గస్ట్ ను  క్లీన్ బౌల్డ్ చేసింది.  

ఆదుకున్న లూయిస్-లారా 

తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లను కోల్పోయిన  ఐర్లాండ్ ను  ఓపెనర్ లూయిస్, కెప్టెన్ లారా డీల్ని ఆదుకున్నారు.  ఇద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు.  వస్త్రకార్ వేసిన నాలుగో ఓవర్లో  లూయిస్, లారా లు తలా ఓ బౌండరీ బాదారు. దీప్తి శర్మ బౌలింగ్ లో కూడా ఇదే  సీన్ రిపీట్ అయింది.  ఆరు ఓవర్లు ముగిసేసరికి  ఐర్లాండ్.. రెండు వికెట్లకు 44 పరుగులు చేసింది.  

వస్త్రకార్ వేసిన  ఇన్నింగ్స్ 8వ ఓవర్  లో మూడో బంతిని వైడ్ గా విసిరింది. అప్పటికే కొద్దిసేపటి నుంచి వీస్తున్న ఈదురుగాలుల్లో  ఉన్నఫళంగా వర్షం కూడా తోడైంది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానాన్ని వీడారు.  అప్పటికి ఐర్లాండ్ స్కోరు.. 54 పరుగులు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం  ఐర్లాండ్.. విజయానికి  ఐదు పరుగుల దూరంలో నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !
IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ