T20 Worldcup: ‘అతి తెలివిగా మాట్లాడకు.. షో నుంచి బయిటికి నడువు..’ టీవీషోలో అక్తర్ కు ఘోర అవమానం

Published : Oct 27, 2021, 06:21 PM IST
T20 Worldcup: ‘అతి తెలివిగా మాట్లాడకు.. షో నుంచి బయిటికి నడువు..’ టీవీషోలో అక్తర్ కు ఘోర అవమానం

సారాంశం

Shoaib Akhtar: మంగళవారం పాకిస్థాన్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఓ లైవ్ షోలో అతడిని షో నుంచి బయటకు వెళ్లిపోవాలని యాంకర్ ఆదేశించాడు.

పాకిస్థాన్ (Pakistan) మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్  (Shoaib Akhtar)కు ఘోర అవమానం జరిగింది. టీ20 ప్రపంచకప్  (T20 worldcup) లో భాగంగా మంగళవారం పాకిస్థాన్-న్యూజిలాండ్ (Pakistan vs newzealnad) ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఓ లైవ్ షోలో అతడిని షో నుంచి బయటకు వెళ్లిపోవాలని యాంకర్ ఆదేశించాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పనికి మాలిన ఆన్సర్స్ ఇస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

వివరాల్లోకెళ్తే.. నిన్నటి మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ లోని ప్రముఖ ఛానెల్ పీటీవీ ఓ లైవ్ షో నిర్వహించింది. ఈ షోకు ప్రముఖ పాకిస్థానీ వ్యాఖ్యాత డాక్టర్ నౌమన్ నియాజ్ (Nouman niyaz) హోస్ట్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అక్తర్ తో పాటు.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్,  ఆకిబ్ జావిద్, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు సారథి సనా మిర్ పాల్గొన్నారు. 

 

మ్యాచ్ విశ్లేషణకు సంబంధించి నౌమన్ నియాజ్ ప్రశ్నలడిగాడు. అయితే అక్తర్.. తనను అడిగిన ప్రశ్నకు కాకుండా పాక్ బౌలర్లు హరీస్ రవుఫ్, షహీన్ షా అఫ్రిది, ఇతర బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. దీనికి నౌమన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అడిగిన ప్రశ్నలకు కాకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దని వారించాడు. దీంతో అక్తర్ హర్ట్ అయ్యాడు. ‘మీరు దురుసుగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్దతి కాదు’ అని ఆయనతో అన్నాడు. 

 

అప్పటిదాకా కామ్ గా సమాధానం చెప్పిన నౌమన్.. అక్తర్ అలా మాట్లాడటంతో అసహనానికి లోనయ్యాడు. ‘అతి తెలివిగా మాట్లాడితే సహించేది లేదు.. షో నుంచి వెళ్లిపోండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నౌమన్ నుంచి అలాంటి సమాధానం వస్తుందని ఊహించని అక్తర్ నోరెళ్లబట్టాడు. మైక్ తీసేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ ఛానెల్ తో తనకు ఉన్న  ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  

 

ఇదిలాఉండగా.. ఇదే విషయమై అక్తర్ తాజాగా ట్విట్టర్ లో కూడా స్పందించాడు. టీవీలలో లక్షలాది మంది చూస్తుండగా నౌమన్ తనను అవమానించడం ఎంతగానో బాధించిందని పేర్కొన్నాడు. షో అయిపోయాక నౌమన్ తనకు క్షమాపణ చెప్తాడని ఆశించానని, కానీ ఆయన అలా చేయకపోవడం విచారకరమని రాసుకొచ్చాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ