T20 Worldcup: స్కాట్లాండ్ దే విజయం.. నోర్మన్ పోరాటం వృథా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన పపువా న్యూ గినియా

By team teluguFirst Published Oct 19, 2021, 7:07 PM IST
Highlights

Scotland vs papua New Guinea: తొలుత టాస్ నెగ్గిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పపువా న్యూ గినియా ఏ దశలోనూ లక్ష్యం కోసం ఆడుతున్నట్టు కనిపించలేదు.

టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) లోకి పసికూనలుగా ఎంట్రీ ఇచ్చిన స్కాట్లాండ్ (Scotland) మళ్లీ అదరగొట్టింది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ గెలుస్తూ సూపర్-12 దిశగా సాగుతోంది. ఒమన్ లోని అల్ అమెరట్ క్రికెట్ స్టేడయంలో  పపువా న్యూ గినియా (Papua New Guinea)తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ కు ఇది రెండో విజయం కాగా.. పీఎన్జీ కి ఇది రెండో పరాజయం.  దీంతో ఆ జట్టు ప్రపంచకప్ సూపర్-12 ఆశలు ఆవిరయ్యాయి. రెండు ఓటములతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తొలుత టాస్ నెగ్గిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పపువా న్యూ గినియా ఏ దశలోనూ లక్ష్యం కోసం ఆడుతున్నట్టు కనిపించలేదు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పీఎన్జీ ఓపెనర్లు టోని ఉర (2), లెగ సియక (9) వెంటవెంటనే నిష్క్రమించారు.

వారి తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ అసద్ (18) పరుగులు చేసి టచ్ లో ఉన్నట్టే అనిపించినా.. ఎవన్స్ బౌలింగ్ లో  వీల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం చార్లెస్ ఎమిని (1) రనౌట్ అయ్యాడు. దీంతో 35 పరుగులకే ఆ జట్టు 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

 

Papua New Guinea's hopes of qualifying for the second round are over |

— ESPNcricinfo (@ESPNcricinfo)

ఈ క్రమంలో బ్యాటింగ్ వచ్చిన నోర్మన్.. (37 బంతుల్లో 47) పీఎన్జీలో విజయంపై ఆశలు కల్పించాడు. అతడు వికెట్ కీపర్ కిప్లిన్ డొరిగ (18), సోపర్ (16)తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. కానీ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో ఆఖర్లో బ్యాట్ ఝుళిపించి ఔటయ్యాడు. దీంతో పీఎన్జీ జట్టు 20 ఓవర్లలో 148 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా స్కాట్లాండ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

 

Yessss !!!! 🔥🔥🔥🔥

He takes career-best figures of 4/18 from 3.3 overs as Scotland beat Papua New Guinea in Oman 👊 pic.twitter.com/bd2M8JklI1

— Somerset Cricket 🏏 (@SomersetCCC)

స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 3.3 ఓవర్లు వేసిన అతడు 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వీల్, ఎవన్స్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్కాట్లాండ్ బ్యాట్స్మెన్ రిచి బెర్రింగ్టన్ ఎంపికయ్యాడు.  

click me!