T20 World cup: పాతవేవీ మనసులో పెట్టుకోకండి మామ.. ఈ మ్యాచ్ లో మీరు గెలవాలి.. మీమ్స్ తో టీమిండియా ఫ్యాన్స్ సందడి

Published : Nov 07, 2021, 02:07 PM ISTUpdated : Nov 07, 2021, 02:36 PM IST
T20 World cup: పాతవేవీ మనసులో పెట్టుకోకండి మామ.. ఈ మ్యాచ్ లో మీరు గెలవాలి.. మీమ్స్ తో టీమిండియా ఫ్యాన్స్ సందడి

సారాంశం

New Zealand Vs Afghanistan: ఈ మ్యాచ్ లో అఫ్గాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడితేనే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. దీంతో నేటి పోరు పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. 

టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో  భాగంగా మరికొద్దిసేపట్లో న్యూజిలాండ్-అఫ్గానిస్థాన్ (New Zealand Vs Afghanistan) మధ్య కీలకపోరు జరుగనున్నది.  అయితే ఈ మ్యాచ్  అఫ్గాన్ కు ఎంత ముఖ్యమో.. టీమిండియా (Team India)కూ అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడితేనే భారత్ సెమీస్ (India Semis Race) ఆశలు సజీవంగా ఉంటాయి. దీంతో ఈ మ్యాచ్ పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అఫ్గానిస్థాన్ గెలవాలని సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడంటే ఈ మ్యాచ్ కు ఉన్న ప్రాధాన్యత తెలుసుకోవచ్చు.

చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు సమయంలో కూడా భారత అభిమానులు ఇంత టెన్షన్ పడలేదేమో. అఫ్గాన్ ఏదైనా చేయకపోతుందా..?  తన స్పిన్ తో మన రషీద్ భాయ్ (ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కనెక్ట్ చేస్తూ..) ఏదైనా అద్భుతం సృష్టించకపోతాడా..? అని కోరుకోని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. 

 

 

ఇక సోషల్ మీడియాలో అయితే ఈ మ్యాచ్ పై మీమ్స్ (memes) మాములగా లేవు. గత రెండ్రోజులుగా భారత  క్రికెట్ అభిమానులు.. ఇదే పని మీద ఉంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాలలో ఈ పిక్స్, పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. ఇన్స్ట్రాగ్రామ్ అయితే  న్యూజిలాండ్-అఫ్గానిస్థాన్ మ్యాచ్ మీమ్స్ తో   పోటెత్తుతున్నది. 

 

 

కాగా.. గ్రూప్-2లో సెమీఫైనల్స్ రేసులో న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, ఇండియా ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో అఫ్గాన్ జట్టు విజయం సాధిస్తే.. కివీస్ ప్రస్థానం ముగిసినట్టే. భారత్ సెమీస్ రేసులోకి వస్తుంది. కానీ అఫ్గాన్.. న్యూజిలాండ్ ను ఓడించినా ఆ జట్టు సెమీస్ చేరాలంటే అది.. రేపు భారత్-నమీబియా మ్యాచ్ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. 

 

నెట్ రన్ రేట్ విషయంలో అఫ్గానిస్థాన్ (1.481), న్యూజిలాండ్ (1.277) కంటే ఇండియా (1.619) మెరుగైన స్థితిలో ఉంది. నేటి మ్యాచ్ లో అప్గాన్ అద్భుతం చేస్తే  అది భారత్ కే లాభం. నమీబియా పై భారీ విజయం సాధించడం  టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఒకవేళ అఫ్గాన్ తో మ్యాచ్ ను  కివీస్ గెలిస్తే.. దానికి ఈ సమీకరణాలతో పనిలేకుండా సెమీస్ కు వెళ్తుంది. 

 

 

 

jఈనెల 3న జరిగిన అప్గాన్ తో జరిగిన పోరులో భారత్.. ఆ జట్టును ఓడించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ లో ఇరగదీసిన టీమిండియా.. ఆ మ్యాచ్ లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు దీనిని దృష్టిలో పెట్టుకునే టీమిండియా ఫ్యాన్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. భారత అభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ లు కూడా ఈ మీమ్స్ ను షేర్ చేయడం విశేషం. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న ఈ మీమ్స్ ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి మరి.. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే