India vs Australia: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో అసాధారణ ఫామ్ ను ప్రదర్శించిన టీంఇండియా ఒక్క ఓటమి లేకుండా అజేయంగా నిలిచి ఫైనల్ కు చేరింది. ఆడిన 10 మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించింది. 1983, 2011లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్.. 2003లో రన్నరప్ గా నిలిచింది.
ICC Cricket World Cup 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 19) ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. కోల్‌కతాలో జరిగిన 2023 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో తక్కువ స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. మల్లీ ఇప్పుడు ఇరు జట్లు ఫైనల్ లో ట్రోపీ సాధించడం కోసం తలబడుతున్నాయి. ఇది ఆస్ట్రేలియా ఆడనున్న ఎనిమిదవ ప్రపంచకప్ ఫైనల్. ఇంతకుముందు ఐదుసార్లు టైటిల్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించింది ఆసీస్.
ఈ మెగా టోర్నీలో ఓటమిలేని భారత్..
undefined
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు టోర్నమెంట్‌లోని మొత్తం 10 గేమ్‌లను గెలిచిన భారతదేశం అత్యుత్తమ జట్టుగా ఉంది. ఒక్కోటమి కూడా లేకుండా ఫైనల్ చేరుకుంది. రాబిన్ రౌండ్ లో తొమ్మిది గేమ్‌లలో తొమ్మిది విజయాలతో లీగ్‌ను అగ్రస్థానంలో ముగించింది. ఇక సేమీ ఫైనల్ లో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు న్యూజిలాండ్‌ను 70 పరుగుల భారీ స్కోరింగ్‌తో ఓడించింది.
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఎప్పుడు జరుగుతుంది?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 19) జరిగే ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాతో ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూడాలంటే..?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఇండియా-ఆస్ట్రేలియా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ను ప్రసారం చేయనుంది.
ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడవచ్చు..?
ఇండియా vs ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ను భారతదేశంలోని హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
ప్రపంచకప్ నాకౌట్‌లో భారత్, ఆస్ట్రేలియా గతంలో..
ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియాలు గతంలో మొత్తం మూడుసార్లు నాకౌట్‌లో తలపడ్డాయి. 2003 ప్రపంచ కప్ ఫైనల్, 2015 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించగా, అహ్మదాబాద్‌లో జరిగిన 2011 ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది.