హాకీ వరల్డ్ కప్ క్వార్టర్స్‌కు వెళ్లాలంటే టీమిండియా చేయాల్సిందిదే.. లేకుంటే మళ్లీ నిరాశే..!

By Srinivas MFirst Published Jan 21, 2023, 2:29 PM IST
Highlights

Hockey World Cup 2022: నాలుగు దశాబ్దాలుగా  హాకీ ప్రపంచకప్ కోసం చూస్తున్న భారత అభిమానులు ఈసారైనా ఆ ఆశ తీరాలని  కోరుకుంటున్నారు.  మరి అందుకు భారత్ చేయాల్సిందేంటి..? 

ఒడిషా లోని భువనేశ్వర్, రూర్కెలా వేదికగా జరుగుతున్న   పురుషుల హాకీ ప్రపంచకప్  లో  భారత్  లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచినా క్వార్టర్స్ కు అర్హత సాధించలేకపోయింది.  పూల్-డీలో ఉన్న భారత్.. ఇంగ్లాండ్ తో కలిసి  పాయింట్ల పరంగా సమానంగా నిలిచినా  గోల్స్ పరంగా  భారత్ కంటే  ఇంగ్లాండ్ కే  ఎక్కువగా ఉండటంతో టీమిండియా రెండో స్థానానికి పరిమితమైంది.  దీంతో  ఇంగ్లాండ్  నేరుగా క్వార్టర్స్ కు అర్హత సాధించగా.. భారత్ మాత్రం క్రాస్ ఓవర్ ఆడాల్సి ఉంది. 

క్రాస్ ఓవర్స్ లో భారత్..  న్యూజిలాండ్ తో తలపడనుంది.  పూల్-సీలో  టాప్-2లో ఉన్న కివీస్ తో భారత్ ఈనెల 22న మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం.   క్రాస్ ఓవర్స్ అంటే నాకౌట్ స్టేజ్  తరహా వంటిదే. ఇక్కడ ఓడితే ఇక ఇంటికే.  

భారత కాలమానం  రేపు సాయంత్రం  ఏడు గంటలకు భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.  ఈ మ్యాచ్ లో  భారత్ నెగ్గితే  క్వార్టర్స్ లో టీమిండియా..  జర్మనీ లేదా  బెల్జియంతో తలపడనుంది. మరి   భారత జట్టు   క్రాస్ ఓవర్స్ దాటి క్వార్టర్స్ కు అడుగుపెడుతుందా..? అంటే మరో 24 గంటలూ వెయిట్ చేయాల్సిందే. 

క్రాస్ ఓవర్స్ మ్యాచ్ ల షెడ్యూల్ : 

జనవరి 22 : మలేషియా వర్సెస్ స్పెయిన్  
జనవరి 22 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 
జనవరి 23 : అర్జెంటీనా వర్సెస్ కొరియా 
జనవరి 23 : జర్మనీ వర్సెస్ ఫ్రాన్స్ 

ఇప్పటికే క్వార్టర్స్ చేరిన జట్లు : 
1. ఆస్ట్రేలియా 
2. నెదర్లాండ్స్ 
3. ఇంగ్లాండ్ 
4. బెల్జియం 

క్రాస్ ఓవర్స్  విజేతలు క్వార్టర్స్ చేరి అక్కడ  ఉన్న నాలుగు జట్లతో తలపడతారు. ఆ తర్వాత సెమీస్, ఫైనల్స్ యథావిధిగా ఉంటాయి. 

click me!