Happy Birthday Virat Kohli: కింగు బర్త్ డే కదా.. ఆ మాత్రం ఉంటది మరి..! ట్వీట్లతో పోటెత్తుతున్న ట్విట్టర్

Published : Nov 05, 2021, 12:38 PM ISTUpdated : Nov 05, 2021, 12:41 PM IST
Happy Birthday Virat Kohli: కింగు బర్త్ డే కదా.. ఆ మాత్రం ఉంటది మరి..! ట్వీట్లతో పోటెత్తుతున్న ట్విట్టర్

సారాంశం

Virat Kohli: విరాట్ కు బర్త్ డే ట్వీట్లతో ఇప్పుడు ట్విట్టర్ మోతెక్కిపోతున్నది. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ఐసీసీ, బీసీసీఐ, ఐపీఎల్ లో కోహ్లి ఆడే ఫ్రాంచైజీ ఆర్సీబీ.. నయా క్రికెట్ దేవుడికి తమదైన రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాయి.

విరాట్ కోహ్లి.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్ లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత అభిమానుల్లో అంతటి చెరగని ముద్ర వేసుకున్న క్రికెటర్.  ఫార్మాట్ ఏదైనా ఈ రన్ మిషన్ క్రీజులోకి దిగాడంటే ప్రత్యర్థులకు దడ పుట్టాల్సిందే.  నేడు 33వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ పరుగుల వీరుడి బర్త్ డే అంటే మామూలుగా ఉంటుందా..? అభిమానులే కాదు.. క్రికెట్ సినీనటులు సైతం కింగ్ కోహ్లి కి విషెస్ చెబుతున్నారు.

విరాట్ కు బర్త్ డే ట్వీట్లతో ఇప్పుడు ట్విట్టర్ మోతెక్కిపోతున్నది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ (ICC), బీసీసీఐ (BCCI), ఐపీఎల్ లో కోహ్లి ఆడే ఫ్రాంచైజీ ఆర్సీబీ.. నయా క్రికెట్ దేవుడికి తమదైన రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాయి.

 

 

ఇక భారత మాజీ క్రికెటర్లు.. వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, వసీం జాఫర్, యూసుఫ్ ఫఠాన్, వంటి వాళ్లతో పాటు కోహ్లి తో కలిసి ఆడుతున్న అజింక్యా రహానే, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్  కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 

 

 

 

నవంబర్ 5, 1988లో న్యూఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ.. 20 ఏళ్ల వయసులో 2008, ఆగస్టు 18న క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు విరాట్. టెస్టు, వన్డే, టీ20 అనే తేడా లేకుండా మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ... ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేలకు పైగా పరుగులు చేశాడు.

 

 

వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా 8 వేలు, 9000, 10,000, 11 వేల మైలురాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 175 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ, 222 ఇన్నింగ్స్‌లో 11 వేల మైలురాయిని అందుకున్నాడు. 

 

 

 

ఇదిలాఉండగా.. ఐసీసీ టీ20  ప్రపంచకప్ లో భాగంగా నేడు టీమిండియా.. స్కాట్లాండ్ తో తలపడబోతున్నది. శుక్రవారం సాయంత్రం.. దుబాయ్ లో జరుగనున్న ఈ పోరులో కూడా అఫ్గాన్ మాదిరే స్కాట్లాండ్ ను కూడా భారీ తేడాతో ఓడించాలని  ఇండియా భావిస్తున్నది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?