ట్రోఫీ ఇచ్చి ఆలింగనం చేసుకున్నాడు: కోహ్లీపై విహారి ప్రశంసలు

By Siva KodatiFirst Published Sep 5, 2019, 9:26 AM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపాడు యువ క్రికెటర్ హనుమ విహరి. రెండో టెస్టు ముగిసిన తర్వాత కోహ్లీ తనకు ట్రోఫీ అందించి.. ఆలింగనం చేసుకున్నాడని విహారి తెలిపాడు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపాడు యువ క్రికెటర్ హనుమ విహరి. రెండో టెస్టు ముగిసిన తర్వాత కోహ్లీ తనకు ట్రోఫీ అందించి.. ఆలింగనం చేసుకున్నాడని విహారి తెలిపాడు.

కెప్టెన్‌తో పాటు జట్టు మొత్తం తనను ఎంతగానో ప్రోత్సహించిందని వెల్లడించాడు. ట్రోఫీ అందించి కోహ్లీ తన ఉదారతను చాటుకున్నాడని.. గెలిచిన ట్రోఫీ పట్టుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని విహారి హర్షం వ్యక్తం చేశాడు.

ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికి అతను ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా ఇదొక అద్భుతమైన జట్టని.. విదేశాల్లో సిరీస్ గెలిచినప్పుడు ఆ ఫీలింగ్ గొప్పగా ఉంటుందని.. టెస్టు ఛాంపియన్‌షిప్‌ను భారీ విజయంతో ఆరంభించినందుకు చాలా సంతోషంగా ఉందని విహారి పేర్కొన్నాడు.

కోహ్లీ స్వేచ్ఛనిస్తాడు... శాస్త్రి సర్ ప్రేరణనిచ్చారని.. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టులో సభ్యుడిని అయినందుకు గర్వంగా ఉందని ఇలాంటి మరెన్నో ఇన్నింగ్సులు ఆడాలని కోరుకుంటున్నట్లు విహారి తెలిపాడు. 

తొలి టెస్టులో విహారి 7 పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు. అయినప్పటికీ కీలక సమయంలో మంచి స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. దీనిపై కెప్టెన్ కోహ్లీ హనుమకు అభినందనలు తెలియజేశాడు. దీనిపై విహారి మాట్లాడుతూ.. సెంచరీ చేజారడంపై తాము మాట్లాడుకోలేదని.. తన ఆటను కోహ్లీ ప్రశంసించాడని వెల్లడించాడు. 

click me!