గ్లోబల్ కెనడా లీగ్ 2019: యువరాజ్, పొలార్డ్ మెరుపులు...అయినా నిరాశే

By Arun Kumar PFirst Published Jul 30, 2019, 8:41 PM IST
Highlights

గ్లోబల్ కెనడా లీగ్ లో మాజీ టీమిండియా ప్లేయర్, టోరంటో నేషన్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్ మరోసారి చెలరేగాడు. అతడికి తోడుగా కిరన్ పొలార్డ్ హాప్ సెంచరీతో అదరగొట్టాడు.  

కెనడా వేదికన జరుగుతున్న గ్లోబల్ టీ20 లీగ్ లో మాజీ టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ అదరగొట్టాడు. టొరంటో నేషన్స్ టీం కెప్టెన్ యువీ ప్రత్యర్థి విన్నిపెగ్ హాక్స్ బౌలర్లను ఊచకోతకోశాడు. అతడు కేవలం 26 బంతుల్లోనే 2 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి కొద్దిలో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు. అయితే టోరంటో జట్టు 216 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికి ఓటమిపాలయ్యింది. 

217 పరుగుల లక్ష్యఛేదన కోసం విన్ని పెగ్ చివరి బంతి వరకు పోరాడింది. ఈ పోరాటం ఫలితంగా చివరకు ఆ జట్టునే విజయం వరించింది ముఖ్యంగా క్రిస్ లిన్ కేవలం 48 బంతుల్లోనే 10 సిక్సర్లు, 4 పోర్లు సాయంతో ఏకంగా 89 పరుగులు చేశాడు. ఇలా లిన్ విధ్వంసం ముందు 217 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నదిగా మారింది. ఇలా విన్ని పెగ్ విజయంలో లిన్ కీలకంగా వ్యవహరించారు.

టోరంటో బ్యాట్స్ మెన్స్ థామస్(46 బంతుల్లో 65),  కిరన్ పొలార్డ్( 21 బంతుల్లో 52 పరుగులు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరితో యువరాజ్ కూడా చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. 

యువరాజ్ పరుగులు సాధించిన విధానాన్ని ప్రశంసిస్తూ గ్లోబల్ టీ20 లీగ్ మేనేజ్ మెంట్ ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేసింది. యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్  చేసి ఓ క్యాప్షన్ ఇచ్చింది. '' యువీ అద్భుతమైన ఇన్నింగ్స్ చూడండి. అతడు కేవలం 26 బంతుల్లోనే రెండు సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 45 పరుగులు సాధించాడు.'' అని అధికారిక ట్విట్టర్ పేజిలో పేర్కొంది.

 

Watch 's fabulous innings of 45 in 26 balls with four 4s & two 6s. pic.twitter.com/hhuzyRhTH7

— GT20 Canada (@GT20Canada)

 

click me!