తొలిచూపు నుంచి ప్రేమ వరకు: మాక్స్ వెల్ కాబోయే భార్య విని రామన్ మాటల్లో

By Sree s  |  First Published Apr 11, 2020, 8:44 AM IST

మాక్స్ వెల్ కాబోయే భార్య విని రామన్ ఇంస్టాగ్రామ్ వేదికగా వారిరువురి ఫోటోను షేర్ చేసి, కింద ప్రీ ఐసొలేషన్ పిక్చర్ అని రాసుకొచ్చింది. అక్కడితో ఆగకుండా ఎడమవైపు స్వీప్ చేయండి, నేను ఈ రిలేషన్ షిప్ కోసం ఎంత చేసానో మీకు అర్థమవుతుంది అని వ్యంగ్యంగా వారిద్దరి రేలషన్ షిప్ లో మాక్స్ వెల్ పాత్ర కన్నా ఆమె పాత్రే ఎక్కువ అనే విషయాన్నీ చెప్పింది. 


ఆస్ట్రేలియన్ స్టార్ అల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ భారత సంతతికి చెందిన గర్ల్ ఫ్రెండ్ విని రామన్ ని త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిరువురి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. 

తాజాగా మాక్స్ వెల్ కాబోయే భార్య విని రామన్ ఇంస్టాగ్రామ్ వేదికగా వారిరువురి ఫోటోను షేర్ చేసి, కింద ప్రీ ఐసొలేషన్ పిక్చర్ అని రాసుకొచ్చింది. అక్కడితో ఆగకుండా ఎడమవైపు స్వీప్ చేయండి, నేను ఈ రిలేషన్ షిప్ కోసం ఎంత చేసానో మీకు అర్థమవుతుంది అని వ్యంగ్యంగా వారిద్దరి రేలషన్ షిప్ లో మాక్స్ వెల్ పాత్ర కన్నా ఆమె పాత్రే ఎక్కువ అనే విషయాన్నీ చెప్పింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Latest Videos

pre-isolation ❤️ swipe left to see how much I contribute to this relationship... 😂

A post shared by VINI (@vini.raman) on Apr 10, 2020 at 4:44am PDT

undefined

ఈ ఇంస్టాగ్రామ్ పోస్టులో ఆమె అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చింది. ఇద్దరిలో మాక్స్ వెల్ త్వరగా నిద్రపోతాడు అనే విషయం దగ్గరినుంచి ఇద్దరిలో వంట ఎవ్వరు బాగా చేస్తారు అనేవరకు రకరకాల విషయాలు చెప్పింది. 

మాక్స్ వెల్ చిందరవందరగా ఉంటాడని, తానే ముందుగా ప్రొపొస్ చేసాడు అని చెప్పుకొచ్చింది విని రామన్. 2013 డిసెంబర్ మెల్బోర్న్ స్టార్స్ ఈవెంట్ లో తొలిసారి కలిశామని, అలా అప్పుడు కలిసిన చూపులు ప్రేమ పట్టాలెక్కడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. 2017 డిసెంబర్ లో గ్మాక్స్వెల్ వినీకి ప్రపోస్ చేసాడు. 

అలా 2 సంవత్సరాల 4 నెలలుగా వీరు ప్రేమలో ఉన్నారు. మాక్స్ వెల్ ఈమెకు ప్రొపొసె చేయడానికి మూడు ప్లాన్లు వేసి విఫలమై, నాలుగో ప్లాన్లో సఫలమైనట్టు చెప్పాడు. ప్లాన్ ఏలో భాగంగా తనను ఓ పార్క్‌ తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నాను. కానీ అక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడం, పెద్దవాళ్లు వాకింగ్ చేయడం, కుక్కలు అరవడం వంటివి తనను ఇబ్బందికి గురిచేసిందని ఈ హార్డ్ హిట్టర్ తెలిపాడు.

ప్లాన్‌ బీలో భాగంగా తనను లంచ్‌కు తీసుకెళ్లి రింగ్ తొడిగి ప్రపోజ్ చేద్దామనుకున్నానని అయితే  అక్కడ తన క్రికెట్ ఫ్రెండ్స్  వుండటం చూసి అమలు చేయలేకపోయానని చెప్పాడు.

ప్లాన్ సీలో భాగంగా గులాబీ పూల మధ్యలో ప్రేమ గురించి చెబుదానుకున్నానని అక్కడా కుదరలేదని గుర్తుచేసుకున్నాడు. ప్లాన్ డీ తప్పక అమలు చేయాల్సిందేనని భావించానని.. పార్క్‌కు వినీని రమ్మని చెప్పాను. ఆమె వచ్చిన వెంటనే మోకాళ్లపై కూర్చొని రింగ్ ఆమెకు తొడిగి ప్రపోజ్ చేశానని చెప్పాడు.

ఆ సమయంలో తన గుండె వంద రెట్లు వేగంగా కొట్టుకుందని, చేతులు వణికాయని మ్యాక్సి చెప్పాడు. అయితే వినీ నా ప్రేమను అంగీకరించడం.. ఆ మధుర క్షణాలు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపాడు. 

click me!