గబ్బా టెస్టు: రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

Published : Jan 19, 2021, 05:53 AM IST
గబ్బా టెస్టు: రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

సారాంశం

7 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ... 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... విదేశాల్లో పేలవమైన రికార్డును కొనసాగించిన రోహిత్ శర్మ..

ఆస్ట్రేలియా టూర్‌లో ఆఖరి టెస్టు ఆఖరి రోజు భారీ ఆశలతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓవర్‌నైట్ స్కోరు 4/0 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో 7 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో టిమ్‌పైన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

చివరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా వచ్చిన రోహిత్ శర్మ, నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 129 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 52 పరుగులు మాత్రమే. మొదటి టెస్టులో 26, 52 పరుగులు చేయగా, రెండో టెస్టులో 44, 7 పరుగులకి అవుటై నిరాశపరిచాడు. 

విదేశాల్లో ఏ మాత్రం మెరుగైన రికార్డు లేని రోహిత్ శర్మ, ఈ సిరీస్‌లో దాన్ని మెరుగుచేసుకుంటాడని అందరూ భావించారు. అయితే చివరి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ హోదాలో బరిలో దిగిన రోహిత్, కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసి ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు.

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !