Lisa Sthalekar: ఫికా నూతన అధ్యక్షురాలిగా లిసా స్తలేకర్.. ఈ స్థానంలో నియమితురాలైన తొలి మహిళగా గుర్తింపు

Published : Jun 21, 2022, 04:39 PM ISTUpdated : Jun 21, 2022, 04:40 PM IST
Lisa Sthalekar: ఫికా నూతన అధ్యక్షురాలిగా లిసా స్తలేకర్.. ఈ స్థానంలో నియమితురాలైన తొలి మహిళగా గుర్తింపు

సారాంశం

FICA New President: ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఫికా) నూతన అధ్యక్షురాలిగా ఓ మహిళ నియమితురాలైంది. ఫికా చరిత్రలో ఓ మహిళకు ఈ గౌరవం దక్కడం ఇదే ప్రథమం. 

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లిసా స్తలేకర్ కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా క్రికెటర్ల భాగోగులను చూసుకునే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఫికా) అధ్యక్షురాలిగా ఆమె నియమితురాలైంది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ లిసానే కావడం గమనార్హం.  స్విట్జర్లాండ్ లో జరిగిన ఫికా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ విక్రమ్ సోలంకి స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నది. 

లిసా నియామకంపై ఫికా స్పందిస్తూ.. ‘ఫికా అధ్యక్షురాలిగా లిసా నియమితురాలైంది.  ఈ వారంలో  స్విట్జర్లాండ్ లోని న్యాన్ లో జరిగిన ఫికా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం. ఈ నియామకంతో లిసా.. ఫికాకు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన బ్యారీ రిచర్డ్స్, జిమ్మీ ఆడమ్స్, విక్రమ్ సోలంకి ల సరసన చేరింది.’ అని తెలిపింది. 

ఇదే విషయమై ఫికా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హీత్ మిల్స్ మాట్లాడుతూ.. ‘మా సభ్యులతో చర్చించిన తర్వాతే మేం ఈ నిర్ణయానికి వచ్చాం. ఆమె మా సంస్థకు తొలి మహిళా అధ్యక్షురాలు. ఈ పదవికి ఆమె అర్హురాలు. క్రికెటర్ గా, కామెంటేటర్ గా, క్రికెట్ ఆస్ట్రేలియాలో సభ్యురాలిగా ఆమెకు  ఎంతో అనుభవమున్నది. అవి ఫికాకు ఎంతగానో ఉపయోగపడతాయి’ అని తెలిపారు. 

 

కరోనా అనంతరం తొలిసారిగా సమావేశమైన ఫికా ఎగ్జిక్యూటివ్ బాడీ..  కొత్త అధ్యక్షుల నియామకంతో పాటు  అంతర్జాతీయంగా క్రికెటర్లు ఎదుర్కుంటున్న సమస్యలు, ఇతర విషయాల గురించి సుదీర్ఘంగా చర్చించింది.  

ఇక తన నియామకంపై లిసా మాట్లాడుతూ.. ‘ఫికా కొత్త అధ్యక్ష పదవి నాకు దక్కినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. క్రికెట్ ఇప్పుడు గ్లోబల్ గేమ్ గా గుర్తింపు పొందుతున్నది. మేము ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది పురుష, మహిళా క్రికెటర్లు ఆట ఆడబోతున్నారు. నేను మా సభ్యులు, ఆటగాళ్ల సంగాల తరపున పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. అంతేగాక ఐసీసీతో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది..’ అని తెలిపింది. 

 

2001 నుంచి 2013 వరకు ఆసీస్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న లిసా.. అంతర్జాతీయ కెరీర్ లో 8 టెస్టులు, 125 వన్డేలు ఆడింది. 54 టీ20లలో కూడా ఆసీస్ కు ప్రాతినిథ్యం వహించింది. 2005, 2013 మహిళల వన్డే ప్రపంచకప్ తో పాటు 2010 లో మహిళల టీ20 ప్రపంచకప్ లలో విజయం సాధించిన ఆసీస్ జట్టులో లిసా సభ్యురాలు. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?