రోహిత్ భయ్యా.. పుల్ షాట్ ఎలా ఆడాలో చెప్తావా..? హిట్ మ్యాన్ రెస్పాన్స్ అదుర్స్

By Srinivas MFirst Published Jan 19, 2022, 3:53 PM IST
Highlights

Rohit Sharma: పుల్ షాట్ ఆడటంలో  ఆరితేరిన  హిట్ మ్యాన్..  దానిద్వారా  అలవోకగా పరుగులు సాధించాడు. ఈ షాట్లను ఆడటంలో అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 274.91 గా ఉంది.
 

ఆధునిక క్రికెట్ లో  ఒక్కో బ్యాటర్ ఒక్కో షాట్ ఆడటంలో ఎక్స్పర్ట్.  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు స్ట్రేట్ డ్రైవ్.. వీరేంద్ర సెహ్వాగ్ కు అప్పర్ కట్.. మాజీ సారథి ఎంఎస్ ధోనికి హెలికాప్టర్ షాట్..  విరాట్ కోహ్లికి  కవర్ డ్రైవ్.. ఇలా ఒక్కొక్కరికి  ప్రత్యేకమైన శైలి ఉంది. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఇష్టమైన షాట్ పుల్ షాట్.. ఆ షాట్ ఆడటంలో  ఆరితేరిన  హిట్ మ్యాన్..  దానిద్వారా  అలవోకగా పరుగులు సాధించాడు.  ఇప్పటికీ ఎవరైనా బౌలర్..  రోహిత్ కు షాట్ బాల్ ను విసరాలంటే సంశయిస్తాడు. ఒకవేళ గతి తప్పి వేస్తే బంతి స్టాండ్స్ లో ఉండాల్సిందే.. 

కాగా తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని రోహిత్ శర్మకు పుల్ షాట్ ఎలా ఆడాలో సలహా ఇవ్వాలని కోరాడు. ట్విట్టర్ లో  హిట్ మ్యాన్ ను  ట్యాగ్ చేస్తూ.. ‘రోహిత్ భయ్యా.. పుల్ షాట్ కచ్చితంగా ఆడటంలో మీ సహాయం కావాలి. నేను ఆ షాట్ ఆడేప్పుడు నియంత్రణ కోల్పోతున్నాను..’ అని ట్వీట్ చేశాడు. 

 

Don’t worry… if the bowler pitches it short, just slice it. What say, ?

— Rohit Sharma (@ImRo45)

సాధారణంగా ఇటువంటి ట్వీట్లకు భారత క్రికెటర్లు పెద్దగా స్పందించరు.  రోజుకు ఇటువంటి ట్వీట్లు వారి ఇన్బాక్స్ లో వందలాదిగా ఉంటాయి. కానీ రోహిత్ మాత్రం.. సదరు  అభిమానికి రిప్లై ఇచ్చాడు. హిట్ మ్యాన్ స్పందిస్తూ.. ‘ఏం బాధపడకు.. ఒకవేళ బౌలర్ షాట్ బంతిని విసిరితే దానిని చిన్నగా స్లైస్ (బాదడం) చేయండి..’ అని రిప్లై ఇచ్చాడు. చివరగా అదే ట్వీట్ లో ముంబయి ఇండియన్స్ జట్టును ట్యాగ్ చేస్తూ.. ‘ఏమంటారు @mipaltan’ అని పేర్కొన్నాడు. 

పుల్ షాట్ ఆడటంలో రోహిత్ శర్మది అందెవేసిన చేయి. ఈఎస్పీఎన్ నివేదిక ప్రకారం..  తన కెరీర్ లో  రోహిత్ శర్మ 2015 నుంచి 2020 దాకా పుల్ షాట్ల ద్వారా ఏకంగా 116 సిక్సర్లు కొట్టాడు.  ఈ జాబితాలో ప్రపంచ క్రికెట్ లో అతడిదే అగ్రస్థానం. అంతేగాక ఇదే కాల వ్యవధిలో పుల్ షాట్లు ఆడటం ద్వారా రోహిత్ ఏకంగా 1,567 పరుగులు సాధించాడట. ఈ షాట్లను ఆడటంలో అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 274.91 గా ఉంది. 2015 నుంచి అతడు సాధించిన పరుగులలో 17 శాతం వాటా పుల్ షాట్లదే కావడం విశేషం.  

దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందు పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మను నాయకుడిగా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నా ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడు పర్యటనకు దూరమయ్యాడు. ముందు టెస్టు సిరీస్ వరకే  అందుబాటులో ఉండడేమో అనుకున్నా తర్వాత వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ కెఎల్ రాహుల్ ప్రస్తుతం టీమిండియాను తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. 

click me!