
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.
చివరికి ఆఫ్రిదిని బద్ధ శత్రువులా భావించే టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సైతం ఆయన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఇది బాగానే ఉన్నప్పటికీ, మరికొందరు మాత్రం ఆఫ్రిదిని ట్రోల్ చేస్తున్నారు.
Also Read:పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా!
‘‘ ఆఫ్రిది పాపం పండింది... కరోనా సోకిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా అఫ్రిదికి కరోనా సోకడంపై ఫన్నీ మీమ్స్, వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
దీంతో నెటిజన్ల తీరుపై టీమిండియా మాజీ టెస్ట్ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఫైరయ్యారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై ఇలాగేనా వ్యవరించేదని నెటిజన్లను నిలదీశాడు. మానవత్వంతో వ్యవహరించాలని సూచించాడు. గతంలో అఫ్రిది ఏం చేశాడో ఇప్పుడు అనవసరమని చెబుతూనే... అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆకాశ్ ట్వీట్ చేశాడు.