ఆ రోజుల్లో అదే గొప్ప, సచిన్‌కు ఎలా సాధ్యమైందంటే: ఇంజమామ్‌

By Siva KodatiFirst Published Feb 28, 2020, 4:21 PM IST
Highlights

ఎవరికీ సాధ్యం కానీ మైలు రాళ్లను నెలకొల్పిన ఈ భారతరత్నానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా అతనిపై పాక్ క్రికెట్ దిగ్గజం ఇంజమాముల్ హక్ ప్రశంసలు కురిపించాడు. 

భారత్‌లో ఒకప్పుడు క్రికెట్ అంటే సచిన్.. సచిన్ అంటే క్రికెట్.. దేశంలో జెంటిల్మెన్ క్రీడకు మాస్ ఫాలోయింగ్‌, క్లాస్ లుక్ తీసుకొచ్చిన వారిలో సచిన్ టెండూల్కర్ ఒకరు. మాస్టర్‌ బ్లాస్టర్‌గా తన సుధీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించిన సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు.

ఎవరికీ సాధ్యం కానీ మైలు రాళ్లను నెలకొల్పిన ఈ భారతరత్నానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా అతనిపై పాక్ క్రికెట్ దిగ్గజం ఇంజమాముల్ హక్ ప్రశంసలు కురిపించాడు.

Also Read:దూసుకొస్తున్న రవీంద్ర జడేజా ఫ్యాన్: కేఎల్ రాహుల్ ప్లేస్ సేఫ్

సచిన్ క్రికెట్ కోసమే పుట్టాడు.. క్రికెట్, సచిన్‌లు వేర్వేరు కాదు. పిన్న వయసులోనే అరంగేట్రం చేసి వకార్ యూనస్, వసీం అక్రమ్ లాంటి మేటి బౌలర్లను వణికించాడని ఇంజమామ్ చెప్పాడు.

మా తరంలో ఏదైనా అసాధారణం అనేది ఏదైనా ఉందా అంటే అది సచిన్ అనే అతను తెలిపాడు. తమ శకంలో పరుగులు చేయడం అంత సులభం కాదన్న ఇంజమామ్.. ఆ రోజుల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగులు చేస్తే అదొక గొప్ప విషయంగా భావించేవారమని తెలిపాడు.

Also Read:పృథ్వీషాపై పుకార్లకు తెర దించిన కోచ్ రవిశాస్త్రి, అశ్విన్ పై అసంతృప్తి

సునీల్ గావస్కర్ సాధించిన 10 వేల పరుగులను గొప్పగా చెప్పుకునేవాళ్లమని.. అది బ్రేక్ అవుతుందని అనుకోలేదన్నాడు. అయితే సచిన్ మాత్రం అన్ని రికార్డులను బ్రేక్ చేశాడని ప్రశంసించాడు.

ఎందుకంటే అతను క్రికెట్ దేవుడు కదా అని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు సచిన్ నెలకొల్పిన రికార్డులను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలని వుందని ఇంజమామ్ ఆకాంక్షించాడు. లెగ్, ఆఫ్ స్పిన్, మీడియం పేస్ బౌలింగ్‌తో సచిన్ బ్యాట్స్‌మెన్లను ఇబ్బందిపెట్టేవాడని అతను పేర్కొన్నాడు. అతను వేసే గూగ్లీలతో తాను కూడా ఇబ్బంది పడ్డానని ఆ రోజులను గుర్తుచేసుకున్నాడు. 

click me!