బాబర్ క్రీజులో ఉన్నా ఎవరూ భయపడటం లేదు.. అది లేకుంటే కష్టం.. పాక్ సారథిపై సహచర ఆటగాడి సంచలన వ్యాఖ్యలు

Published : Feb 28, 2023, 05:17 PM IST
బాబర్ క్రీజులో ఉన్నా ఎవరూ భయపడటం లేదు.. అది లేకుంటే కష్టం.. పాక్ సారథిపై సహచర  ఆటగాడి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Babar Azam: వ్యక్తిగత రికార్డుల కోసమే  తప్ప  జట్టు కోసం ఆడడని  బాబర్ ఆజమ్ మీద ఆరోపణలున్నాయి.   అదీగాక బాబర్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు భయపడరని, అతడి వల్ల ముప్పేమీ లేదనే భావనలో ఇతర టీమ్ లు ఉంటాయని... 

పాకిస్తాన్  క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ కు భారత్  లో విరాట్ కోహ్లీకి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.  కోహ్లీ మాదిరే మూడు ఫార్మాట్లలోనూ  అదరగొట్టే బాబర్  పై  ఆ దేశ అభిమానులు భారీ ఆశలు పెట్టుకుంటారు. కానీ బాబర్.. వ్యక్తిగత రికార్డుల కోసమే  తప్ప  జట్టు కోసం ఆడడని  అతడి మీద ఆరోపణలున్నాయి.   అదీగాక బాబర్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు భయపడరని, అతడి వల్ల ముప్పేమీ లేదనే భావనలో వాళ్లు ఉంటారని పాకిస్తాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ కామెంట్స్ చేశాడు. ఇమామ్ స్వయంగా బాబర్ తో కలిసి టెస్టులు, వన్డేలు ఆడే క్రికెటర్ కావడం గమనార్హం. 

ఓ టీవీ ఛానెల్ లో  జరిగిన చర్చలో  ఇమామ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అతడు మాట్లాడుతూ... ‘బాబర్  కొంతసేపు క్రీజులో ఉన్న తర్వాత  నేను ఇప్పటికే చాలాసేపు క్రీజులో ఉన్నానని అనుకుంటాడు.  అతడు వరల్డ్ క్రికెట్ లో ఆధిపత్యం చూపాలంటే  కొన్ని మార్చుకోవాలి.  మ్యాచ్ లను ఫినిష్ చేసే దిశగా అతడు సాధన చేయాలి.. 

మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను డామినేట్ చేస్తూ ఆడాలి. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రమాదకర ఆటగాళ్లు అనదగ్గవారిలో ముందు వరుసలో ఉండే విరాట్ కోహ్లీ అయినా  ఏబీ డివిలియర్స్ అయినా  ప్రత్యర్థి బౌలర్లపై చేసేది ఇదే.  బాబర్ కూడా ముందు తన స్ట్రైక్ రేట్ మీద దృష్టిసారించాలి.  50 పరుగులు చేయగానే   హమ్మయ్యా ఇక నా పని అయిపోయింది అన్నట్టు ఉండకూడదు.   మ్యాచ్ ను ముగించేదాకా  ఆడాలి... 

ఫిఫ్టీ తర్వాత మరింత స్వేచ్ఛగా  ఆడాలి.  అప్పుడే బౌలర్లు భయపడతారు.  బాబర్ క్రీజులో ఉన్నా  ప్రత్యర్థి బౌలర్లు  భయపడేంత స్థాయిలో అతడి ఆట ఉండటం లేదు. దానిని మార్చుకోవాలంటే బాబర్ తన స్ట్రైక్ రేట్ ను పెంచుకోవాలి. అది బాబర్  కు వ్యక్తిగతంగానే గాక  జాతీయ జట్టుకూ మంచిది..’అని కామెంట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  

 

కాగా బాబర్ ప్రస్తుతం   పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో పెషావర్ జల్మీ తరఫున  సారథిగా ఉన్నాడు.   పీఎస్ఎల్ - 8లో పెషావర్.. ఐదు మ్యాచ్ లు ఆడి రెండింటిలో మాత్రమే గెలిచి మూడింటిలో ఓడింది. పాయింట్ల పట్టికలో ఆ  జట్టు.. ఐదో స్థానంలో నిలిచింది.   ప్రస్తుతం ఆ జట్టు ఫైనల్ చేరడం గగనమే అయినా తదుపరి మ్యాచ్ లలో గెలిచి  పరువు కాపాడుకోవాలని భావిస్తున్నది. 

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర