ఉత్తరాఖండ్ క్రికెటర్లకు జీతాల్లేవ్.. రోజూ కూలీ కంటే అధ్వాన్నం.. ఫుడ్ అడిగితే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకోమని సలహా

Published : Jun 10, 2022, 03:07 PM ISTUpdated : Jun 10, 2022, 03:08 PM IST
ఉత్తరాఖండ్ క్రికెటర్లకు జీతాల్లేవ్.. రోజూ కూలీ కంటే అధ్వాన్నం.. ఫుడ్ అడిగితే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకోమని సలహా

సారాంశం

Ranji Trophy: క్రికెట్ ఆడే దేశాలలో అత్యంత ధనవంతమైన బోర్డు గా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి పేరుంది. కానీ అదే బీసీసీఐ పరధిలోకి వచ్చే ఉత్తరాఖండ్ క్రికెటర్లకు మాత్రం రోజూవారి ఇచ్చే జీతాలు మాత్రం అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయి.   

రంజీ ట్రోఫీలో భాగంగా  గురువారం ముంబైతో ముగిసిన మ్యాచ్ లో ఉత్తరాఖండ్ జట్టు 725 పరుగుల భారీ తేడాతో  ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి కంటే  ఆ జట్టు ఆటగాళ్లు  మరింత కుమిలి కుమిలి ఏడ్చే విషయం మరొకటి ఉంది. ఉత్తరాఖండ్ రంజీ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లకు రోజూ ఇచ్చే డైలీ అలవెన్స్ (డీఏ) అక్షరాలా వంద రూపాయలు.  ఈ రోజుల్లో ఒక నైపుణ్యం కలిగిన కార్మికుడు కూడా  తక్కువలో తక్కువ రూ. 800 సంపాదిస్తున్నాడు. ఒక  నిర్మాణ రంగ కార్మికుడి దినసరి కూలీ రూ. 500 కు తక్కువగా లేదు. వీళ్లతో పోల్చితే  ఉత్తరాఖండ్ క్రికెటర్ల పరిస్థితి అధ్వాన్నమే కదా.. 

నిబంధనల ప్రకారం ఉత్తరాఖండ్  లో నెలనెలా ఇచ్చే జీతాలతో పాటు డీఏ కింద ఒక సీనియర్ క్రికెటర్ కు రోజుకు రూ. 1,500 చెల్లించాలి. ఒక్కోసారి  ఇది  వెయ్యి,  రూ. 2 వేలుగా ఉంటుంది. కానీ గడిచిన ఏడాది కాలంగా ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న క్రికెటర్లకు రోజుకు రూ. 100 కూడా డీఏ దక్కడం లేదు. 

జీతభత్యాల కోసం క్రికెటర్లు ఉత్తరాఖండ్  క్రికెట్ అసోసియేసన్ (సీఏయూ) ను అడిగి అడిగి అలిసిపోయారు.  డీఏ ఒక్కటే కాదు.. మ్యాచులు జరుగుతున్న సమయంలో పెండింగ్ డ్యూస్  చెల్లించాలని, తమకు భోజన ఖర్చులకు డబ్బులు లేవని అడిగితే స్విగ్గీ, జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవాలని సూచించాడట. 

న్యూస్9 లో వచ్చిన నివేదిక ప్రకారం.. సీఏయూ ఆడిట్ లెక్కలు తనిఖీ చేస్తే మాత్రం ఫుడ్, ఇతర ఖర్చుల కోసం భారీగా వెచ్చిస్తున్నట్టుగా ఉంది. గతేడాది ఫుడ్ కోసం..  రూ. 1,74,07,346 కోట్లు, రూ. 49,58,750  లక్షలు డీఏ కోసం, రూ. 35 లక్షలు అరటి పండ్లకు, రూ. 22 లక్షలు వాటర్ బాటిల్స్ కోసం ఖర్చు చేసినట్టు రాసి ఉంది. మరి ఈ సొమ్మంతా ఎక్కడికి పోతుంది..? అనేది మాత్రం సస్పెన్స్.. 

తమకు రావాల్సిన జీతాలు, ఇతరత్రా భత్యాల గురించి ఓ సినీయర్ ప్లేయర్ సీఏయూ అధికారులను నిలదీస్తే అతడు చెప్పిన సమాధానం.. ‘అరె.. ప్రతిసారి ఇదే ప్రశ్న అడుగుతున్నావ్.. మీకు డబ్బులిస్తాం. మేమెక్కడికి వెళ్లం.  అప్పటిదాకా ఆ స్విగ్గీలోనే జొమాటోలోనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోపోండి..’ అని దురుసుగా  సమాధానం చెప్పాడట.  

సీఏయూలో అవినీతి రాజ్యమేలుతుందని.. వారి వల్లే రాష్ట్ర క్రికెట్ అదోగతి పాలైందని స్థానిక క్రికెటర్లు వాపోతున్నారు. మరి ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు గా పేరున్న బీసీసీఐ.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా..?   లేదా..? అనేది వేచి చూడాలి. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !