జియో దెబ్బకు దిగొచ్చిన హాట్‌స్టార్.. టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ రెండూ టోర్నీలు ఫ్రీగానే చూడొచ్చు

Published : Jun 09, 2023, 12:40 PM IST
జియో దెబ్బకు దిగొచ్చిన హాట్‌స్టార్..  టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ రెండూ టోర్నీలు ఫ్రీగానే చూడొచ్చు

సారాంశం

Disney Hotstar: టీమిండియా ఫ్యాన్స్‌కు ప్రముఖ ఓటీటీ  సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి  సబ్‌స్క్రిప్షన్ లేకుండానే  అభిమానులకు  మెగా టోర్నీల ప్రసారాన్ని అందించనుంది. 

ఐదేండ్ల పాటు (2018 -2022) ఐపీఎల్ ప్రసారాలను  లైవ్ టెలికాస్ట్ చేసిన  డిస్నీ  ప్లస్ హాట్ స్టార్  ఈ ఏడాది  అంబానీ  సంస్థ వయాకామ్ 18 ఇచ్చిన దెబ్బకు  కుదేలైంది.  బీసీసీఐ గతేడాది నిర్వహించిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో భాగంగా టీవీ రైట్స్  దక్కించుకున్నా  డిజిటల్ రైట్స్ మాత్రం ఆ (స్టార్‌)  సంస్థకు దక్కలేదు.  అంబానీకి చెందిన వయాకామ్ (జియో సినిమా) వీటిని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది  ఐపీఎల్ ప్రసారాలను దేశవ్యాప్తంగా  ఉచితంగా అందించింది జియో.   వయాకామ్ దెబ్బకు కుదేలైన హాట్ స్టార్ ఇప్పుడు దిగొచ్చింది. 

ఐపీఎల్  డిజిటల్ హక్కులు లేకపోయినా ఆసియాకప్ తో పాటు  ఐసీసీ ఈవెంట్ల బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ హాట్ స్టార్ వద్దే ఉన్నాయి. ఈ ఏడాది ఈ రెండు  టోర్నీలూ (ఆసియా కప్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్)  జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హాట్ స్టార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

సెప్టెంబర్ లో జరుగబోయే  ఆసియా కప్ తో పాటు  అక్టోబర్ లో భారత్ వేదికగా    జరుగనున్న  ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌నూ హాట్ స్టార్ ఉచితంగా అందించనుంది.  అంటే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే  హాట్ స్టార్ లో ఆసియా కప్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్  చూడవచ్చు.   అయితే ఇది మొబైల్స్ వరకే పరిమితం.    

ఐపీఎల్ ద్వారా  జియో సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ పెరిగింది. కొన్ని మ్యాచ్ లకు వ్యూయర్ షిప్.. 2.8 కోట్లకు చేరింది. ఇక ఐపీఎల్ - 16 ఫైనల్ అయితే రాత్రి 3 గంటల దాకా ముగియకున్నా  వ్యూయర్ షిప్  3 కోట్లకు చేరింది.   ఇది ఆల్ టైమ్ రికార్డు. జియో దెబ్బతో  టెలివిజన్ వ్యూయర్ షిప్ గణనీయంగా తగ్గాయి.  కొన్ని మ్యాచ్ లకు మినహా మిగిలిన మ్యాచ్ లకు అనుకున్న స్థాయిలో వ్యూయర్షిప్ రాలేదు. 

 

తాజాగా ఓవల్ లో జరుగుతున్న  డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా  డిస్నీ హాట్ స్టార్ లోనే ప్రత్యక్ష ప్రసారం అవుతున్నది.  కానీ ఇది చూడాలంటే  ప్లాన్స్ ప్రకారం కొంత రుసుము చెల్లించాలి.  అయితే  ఆసియా కప్,  వన్డే వరల్డ్ కప్ కు మాత్రం ఏ విధమైన సబ్  స్క్రిప్షన్ అవసరం లేకుండానే  మ్యాచ్ లను ఫ్రీగా చూసేయొచ్చు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !