మహేంద్రసింగ్ ధోని సూపర్ ఇన్నింగ్స్ కూడా సిఎస్కెను గెలిపించలేకపోయింది... విశాఖపట్నం వేదికగా జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో డిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ పై ధోని భార్య సాక్షి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
విశాఖపట్నం : చెన్నై సూపర్ కింగ్స్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యం వుంది. ఈ లక్ష్యానికి కనీసం దరిదాపుల్లోకి చేరకముందే కీలక బ్యాట్ మెన్స్ అందరూ పెవిలియన్ కు చేరారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ చెన్నై ఫ్యాన్స్ కు ఒక్కటే ఆశ... మహేంద్ర సింగ్ ధోని. ఈ ఐపిలఎల్ తొలిసారి బ్యాటింగ్ చేసిన ధోని చెన్నైని గెలిపించలేపోయినా తన ధనాధన్ ఇన్సింగ్స్ తో పైసా వసూల్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చాడు. తమ టీమ్ ఓడినా ధోని విశ్వరూపం చూసిన చెన్నై ఫ్యాన్స్ సంతృప్తితో మైదానాన్ని వీడారు.
అయితే బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న ధోని క్రీజులో వున్నాకూడా సిఎస్కేను గెలిపించలేకపోయారు. ధోని కేవలం 16 బంతుల్లో 37 పరుగులు (4 ఫోర్లు, మూడు సిక్సులు) చేసినా ఇది జట్టును గెలిపించలేకపోయాడు. ధోని మెరుపుల మధ్యే సిఎస్కే ఇన్సింగ్ 171 పరుగులకే ముగియడంతో డిల్లీ క్యాపిటల్ విజేతగా నిలిచింది. ఈ ఐపిఎల్ లో ధోని మొదటిసారి బ్యాటింగ్ కు దిగగా... సిఎస్కే మొదటి ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంపై ధోని భార్య సాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
undefined
డిల్లీ చేతిలో సిఎస్కే ఓడినా అభిమానుల మనసు దోచుకున్నది ధోనీ ఇన్సింగ్సే. 231 స్రైక్ రేట్ తో సూపర్ ఇన్సింగ్స్ ఆడిన ధోనికి ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది. మ్యాచ్ అనంతరం ఈ అవార్డును చిరునవ్వు చిందిస్తూ అందుకున్న ధోని ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సాక్షి. ''మనం ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నా'' అంటూ సాక్షి కామెంట్ చేసారు. అంటే ధోని ఇంత అద్భుతంగా ఆడినా మ్యాచ్ గెలవలకపోవడంతో ఒకింత ఆశ్చర్యం కలిగిందనేలా సాక్షి కామెంట్ వున్నాయి. ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజా ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి పడిపోయింది. మూడు మ్యాచులాడిన సిఎస్కే రెండు గెలిచి ఒకటి ఓడిపోయింది.ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఈ పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ మూడు, గుజరాత్ నాలుగు, సన్ రైజర్స్ ఐదో స్థానంలో నిలిచాయి.