Suryakumar Yadav : హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఇప్పటికే వరుసగా ఆడిన మూడు మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. దీంతో వరుసగా హార్దిక్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కష్టాల్లో ఉన్న ముంబైకి గుడ్ న్యూస్ అందింది.
Suryakumar Yadav : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్2024) 17వ సీజన్ లో ముంబై ఇండిన్స్ ఆడిన మూడు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. అయితే, వరుస ఓటములు, అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. విధ్వంసకర ప్లేయర్ టీమ్ లోకి రానున్నాడు. అతనే సూర్యకుమార్ యాదవ్. నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ శిక్షణ తీసుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు శారీరకంగా దృఢంగా ఉన్నాడని సర్టిఫికెట్ ఇచ్చారు.
undefined
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో ముంబై టీమ్ లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న సూర్యకుమార్.. గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభమ్యాచ్ లకు దూరమయ్యాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్య.. గాయం కారణంగా అప్పటి నుంచి ఏ సిరీస్‌లోనూ ఆడలేదు. అతను గతంలో స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు.
దీంతో సుదీర్ఘ విశ్రాంతి తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఇంటెన్సివ్ శిక్షణలో సూర్యకుమార్ నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజన్ ప్రంభమైంది. ఇందులో ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్‌లు ఆడి మొత్తం 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ టీమ్ లోకి రావడం మరింత బలాన్ని ఇస్తుంది. ఇది వరకు సూర్యకుమార్ యాదవ్ ఫిట్ గా లేడని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్‌గా ఉన్నారని ప్రకటించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ ద్వారా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించబడ్డాయి. అందులోనూ బాగా ఆడాడు. అప్పటి నుంచి అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారు.
తద్వారా ముంబై ఇండియన్స్ జట్టులో చేరవచ్చు. ముంబై ఇండియన్స్‌లో చేరడానికి ముందు అతను 100 శాతం ఫిట్‌గా ఉన్నాడు. అలాగే పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రతికూలంగా మమారిందనే చెప్పాలి. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ వీలైనంత త్వరగానే ముంబై జట్టులో చేరనున్నాడు. 7వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆడతాడని భావిస్తున్నారు. వరుస ఓటములతో నిరాశతో ఉన్న ముంబై ఇండియన్స్ అభిమానులకు సూర్య వస్తున్నాడనే వార్త జోష్ ను నింపుతోంది.
ఇదేమీ ఆటరా బాబు.. గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు