
virat kohli unseen viral video: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఐసీసీ మెగా టోర్నీలో వరుసగా 10 విజయాలతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లోకి ప్రవేశించి ట్రోఫీని గెలుచుకునే ఫేవరెట్ జట్టుగా నిలిచింది. కానీ భారత జట్టును నిలువరించి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఓటమి తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన భారత ఆటగాళ్లు నిరాశతో గ్రౌండ్ ను వీడారు. ఫైనల్ ముగిసిన నెల రోజుల తర్వాత మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ స్పందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత మాజీ కెప్టెన్ కోహ్లీ తన సహచరుల వద్దకు కరచాలనం కోసం వెళ్లే ముందు స్టంప్స్ వైపు నడుస్తూ, టోపీతో బెయిల్స్ తొలగించడం కనిపించింది. తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా కనిపించింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రపంచ కప్ 2023 ఫైనల్ లో భారత్ 240 పరుగులు సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 63 బంతుల్లో 54 పరుగులు చేవాడు. కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత పేసర్లు మెన్ ఇన్ బ్లూ జట్టును బరిలోకి తీసుకువచ్చారు. కానీ, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ భారత బౌలింగ్ అటాక్ ను ఎదుర్కొని నాలుగో వికెట్ కు 192 పరుగులు జోడించి తమ జట్టును ఆరో ప్రపంచ కప్ విజయం అంచున నిలిపారు. ట్రావిడ్ హెడ్ 137 పరుగులు చేయగా, లబుషేన్ 110 బంతుల్లో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వరల్డ్ కప్ ఓటమి తర్వాత విరామం తీసుకున్న కోహ్లీ దక్షిణాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్ కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పునరాగమనం చేసి రెండు ఇన్నింగ్స్ ల్లో 38, 76 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ రాణించకపోవడంతో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఇక జనవరి 3 నుంచి 7 వరకు కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఇంగ్లాండ్ తో భారత్ సుదీర్ఘ టెస్టు సిరీస్ ఆడనుంది. అలాగే, ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కూడా భారత్ ఆడనుంది.
డేవిడ్ వార్నర్‌కు బిగ్ షాక్.. ఎమోషనల్ వీడియో.. ఇలా చేశారేంట్రా మీరు !