David Warner: "అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడం కత్తిమీద సామే.." డేవిడ్ వార్నర్ ను భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?

By Rajesh Karampoori  |  First Published Jan 2, 2024, 5:13 AM IST

David Warner: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ వన్డేల నుండి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వార్నర్ తన కెరీర్‌లో ఏ బౌలర్‌ను ఆడటం చాలా కష్టంగా భావించాడో చెప్పాడు. అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు కత్తిమీద సాములా అనిపించిందని అన్నారు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరు? 


David Warner: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అకస్మాత్తుగా వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికి క్రికెట్ అభిమానులను షాక్ గురి చేశారు. అంతకుముందు  అతడు తన టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వార్నర్ పాకిస్థాన్‌తో తన కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్‌ను ఆడుతున్నాడు. అయితే అంతకు ముందే వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

వీటన్నింటి మధ్య  వార్నర్ తన కెరీర్‌లో ఏ బౌలర్‌ ను ఎదుర్కొవడంలో తాను చాలా కష్టంగా భావించాడో చెప్పాడు. తమ అభిమాన బ్యాట్స్‌మన్‌ను ఏ బౌలర్‌ ఎక్కువగా ఇబ్బంది పెట్టాడో తెలుసుకోవాలని అభిమానులు తరచుగా ఆసక్తిగా ఉంటారు.  

Latest Videos

Cricket.com.auకు ఇచ్చిన ఇంటర్య్వూలో వార్నర్ మాట్లాడుతూ.. వార్నర్ తన కెరీర్‌లో అత్యంత కష్టతరమైన బౌలర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు డేల్ స్టెయిన్‌ని గుర్తించానని చెప్పాడు. వేరే అభిప్రాయమే లేదని, డేల్ స్టెయిన్ ను ఎదుర్కొవడం కొన్ని సమయాల్లో కష్టంగా భావించానని తెలిపారు. 2016-17లో దక్షిణాఫ్రికా ఆసీస్‌ పర్యటనకు వచ్చినప్పుడు స్టెయిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు కత్తిమీద సాములా అనిపించిందని అన్నాడు.

తన 15 ఏళ్ల కెరీర్ లో తాను చూసిన టఫెస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ అనీ, ఆ విషయంలో డౌటే అక్కర్లేదు. 2016-17లో వాకా (పెర్త్‌) స్టేడియంలో తాను, షాన్‌ మార్ష్‌.. స్టెయిన్‌ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డామని తెలిపారు. ప్రత్యేకించి ఆ టెస్టులో 45 నిమిషాల సెషన్‌ వెళ్లాల్సి వచ్చినప్పుడు అయితే తమకు చుక్కలు కనిపించాయనీ, ఆ సమయంలో షాన్ తన దగ్గరకు వచ్చి .. తాను స్టెయిన్ ను ఎలా ఎదుర్కొవాలో తనకు తెలియడం లేదని చెప్పాడని తెలిపారు. తాను ఎదుర్కున్న బౌలర్లలో స్టెయిన్‌ చాలా టపెస్ట్ బౌలర్ అని, లెఫ్ట్‌ హ్యాండర్‌ ను ముప్పు తిప్పలు పెట్టడంలో స్టెయిన్‌ది ప్రత్యేక శైలి అని కితాబ్ ఇచ్చారు.   

డేవిడ్ వార్నర్ 50-ఓవర్ల ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై దృష్టి సారించి, పునరాగమనం గురించి సూచించినట్లు వార్నర్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుందని నాకు తెలుసు. రెండేళ్లలో అయినా నేను మంచి క్రికెట్ ఆడగలను అని అన్నాడు. ఎవరికైనా నా అవసరం ఉంటే నేను అందుబాటులో ఉంటానని అన్నాడు.

click me!