Dc vs KXIP IPL 2020: స్టోయినిస్ సూపర్ షో... మంచి స్కోరు చేసిన ఢిల్లీ...

Published : Sep 20, 2020, 09:22 PM ISTUpdated : Sep 20, 2020, 09:23 PM IST
Dc vs KXIP IPL 2020: స్టోయినిస్ సూపర్ షో... మంచి స్కోరు చేసిన ఢిల్లీ...

సారాంశం

ఐపీఎల్ కెరీర్‌లో బెస్ట్ ఫిగర్స్ నమోదుచేసిన షమీ... 15 పరుగులకే 3 వికెట్లు తీసిన మహ్మద్ షమీ... నాలుగో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్...

Dc vs KXIP IPL 2020: ఐపీఎల్ 2020లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే రనౌట్ కాగా, పృథ్వీషా 5, హెట్మయర్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు.

నాలుగో వికెట్‌కి 73 పరుగులు జోడించారు. అయితే 31 పరుగులు చేసిన రిషబ్ పంత్, 39 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ వెంటవెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ మళ్లీ కష్టాల్లో పడింది.
పంజాబ్ బౌలర్లు బౌండరీలకి అవకాశం ఇవ్వకపోవడంతో రన్‌ రేటు మందగించింది.

అక్షర్ పటేల్ 6 పరుగులు, అశ్విన్ 4 పరుగులు చేయగా... స్టోయినిస్ వరుస బౌండరీలతో దూకుడుగా ఆడడంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో 2 సిక్సులు, మడు ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదాడు స్టోయినిస్. స్టోయినిస్ ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ స్కోరు పరుగులు పెట్టింది. 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు స్టోయినిస్. 

మహ్మద్ షమీ 3 వికెట్లు తీయగా, కాంట్రిల్‌కు రెండు, యంగ్ బౌలర్ రవి బిష్నోయ్‌‌కి ఓ వికెట్ దక్కింది. 

PREV
click me!

Recommended Stories

IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !
Rohit Sharma : షాకింగ్.. అసలు విషయం చెప్పిన రోహిత్!