రోహిత్ శర్మ 400 పరుగులైనా చేయగలడు... ఆసిస్ క్రికెటర్ పొగడ్త

By telugu teamFirst Published Dec 2, 2019, 11:35 AM IST
Highlights

పాకిస్తాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ 335 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా... గతంలో బ్రియాన్ లారా పేరిట ఉన్న 400 రికార్డుని వార్నర్ బ్రేక్ చేస్తాడని అందరూ భావించారు.  అయితే అనూహ్యంగా ఆసీస్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మపై ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 400 పరుగులు చేయగల సత్తా రోహిత్ శర్మకి ఉందని వార్నర్ అభిప్రాయపడ్డాడు.  

ఇంతకీ మ్యాటరేంటంటే... పాకిస్తాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ 335 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా... గతంలో బ్రియాన్ లారా పేరిట ఉన్న 400 రికార్డుని వార్నర్ బ్రేక్ చేస్తాడని అందరూ భావించారు.  అయితే అనూహ్యంగా ఆసీస్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

AlsoRead నెంబర్ 8 సెంచరీ వృధా... అయినా పాకిస్తాన్ కు తప్పని ఫాలో ఆన్...

దీనిపై వార్నర్ స్పందించాడు. ‘‘ నా ఆట గురించి నేనే చెప్పగలను. మైదానంలో బౌండరీలు చాలా పెద్దవి. వేగంగా పరుగులు చేయడం అంత సులువు కాదు. తీవ్రంగా అలసిపోయిన తర్వాత మరింత శ్రమించడం, ఏదోలా పరుగుల కోసం ప్రయత్నించడం కష్టంగా మారుతుంది. చివర్లో నేను బౌండరీలు కొట్టలేక సింగిల్స్ తీస్తూ పోయాను. అయితే... 400 పరుగుల ఘనతను సాధించగల ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే రోహిత్ శర్శ పేరు మాత్రం చెప్పగలను’ అని పేర్కొన్నాడు.

రోహిత్ శర్మకు 400 పరుగులు చేయగల సత్తా ఉందని ప్రశంసలు కురిపించాడు. అనంతరం సెహ్వాగ్ గురించి మాట్లాడుతూ... కెరీర్‌ ఆరంభంలోనే తాను టెస్టు ఆటగాడిగా ఎదగగలనని నమ్మకం పెంచిన వ్యక్తి సెహ్వాగ్ అని వార్నర్‌ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో సెహ్వాగ్‌తో కలిసి అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడాడు. టి20లు, వన్డేల్లో ఆసీస్‌కు ఆడిన మూడేళ్ల తర్వాత గానీ అతనికి తొలి టెస్టు అవకాశం రాలేదు.

 ‘నేను మంచి టెస్టు ఆటగాడిగా ఎదగగలనని సెహ్వాగ్ చెబితే పిచ్చోడిని చూసినట్లు చూశాను. కానీ అతను టెస్టుల్లో ఉండే ఫీల్డింగ్‌ వ్యూహాలు నాలాంటి ఆటగాడికి సరిగ్గా సరిపోతాయని విశ్లేషించడం నాకింకా గుర్తుంది’ అని వ్యాఖ్యానించాడు.  
 

click me!