డబుల్ సెంచరీతో క్రికెట్ చరిత్రలో రికార్డుల మోత మోగించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

By Mahesh Rajamoni  |  First Published Nov 8, 2023, 4:51 AM IST

Glenn Maxwell: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వన్డే ఛేజింగ్ లో ఆసీస్ ప్లేయ‌ర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ సాధించిన అద్భుత డబుల్ సెంచరీ ప‌లు రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా క్రికెట్ లో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
 


Glenn Maxwell rewrote Cricket history: ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్‌పై గ్లెన్ మాక్స్‌వెల్ త‌న అద్భుతమైన ఇన్నింగ్స్ తో క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డులు సృష్టించాడు. అత‌ని డ‌బుల్ సెంచ‌రీ (128 బంతుల్లో 201*)  ఇన్నింగ్స్ నిస్సందేహంగా రాబోయే సంవత్సరాల్లో గుర్తిండిపోయే అసాధారణమైన క్షణాలలో ఒకటి. ఆస్ట్రేలియా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోప‌డ్డ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ త‌న వీరోచిత పోరాటంతో జ‌ట్టుకు విజ‌యం అందించాడు. త‌న డ‌బుల్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో అనేక రికార్డులు నెల‌కొల్పాడు.

మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో సాధించిన రికార్డులు, ఫీట్‌లను గ‌మ‌నిస్తే.. 

Latest Videos

undefined

నాన్-ఓపెనర్ డబుల్ సెంచరీ: మాక్స్‌వెల్ సాధించిన డబుల్ సెంచరీ సాధార‌ణ  డబుల్ సెంచరీ కాదు.. వన్డే ఇంటర్నేషనల్స్ (ODIలు)లో ఓపెనర్ గా రాకుండా ఒక బ్యాట‌ర్ డ‌బుల్ సెంచ‌రీ సాధించ‌డం ఇదే మొద‌టిసారి. అది గ్లెన్ మ్యాక్స్ వెల్ సాధించాడు.

వన్డే పరుగుల ఛేదనలో అత్యధిక స్కోరు: మాక్స్‌వెల్ ఫీట్ రికార్డు పుస్తకాలను తిరగరాయడమే కాకుండా, ODI ఛేజింగ్ సాధించిన మొట్ట‌మొద‌టి డ‌బుల్ సెంచరీని సాధించాడు. ప‌రుగుల చేధ‌న‌లో  వ‌చ్చే ఒత్తిడి ఎదుర్కొంటూ ఈ విజయాన్ని సాధించ‌డం ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఈ ఇన్నింగ్స్ కు ముందు న‌మోదైన డ‌బుల్ సెంచ‌రీలు అన్ని కూడా ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో న‌మోదైన‌వే. 

చేధ‌న‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్: మాక్స్‌వెల్ అజేయమైన డ‌బుల్ సెంచ‌రీ (201*) ODI ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును సృష్టించింది. 

రెండో ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ: మాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్, ODIల చరిత్రలో 200 పరుగుల మార్క్‌ను చేరుకున్న రెండవ అత్యంత వేగ‌వంత‌మైన డ‌బుల్ సెంచ‌రీ సాధించిన ఆటగాడిగా ఫీట్ రికార్డు సాధించింది. 

ఇంత‌ముందు డ‌బుల్ సెంచ‌రీలు గ‌మ‌నిస్తే.. 

126 బంతుల్లో ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ - ఇషాన్ కిషన్
128 బంతుల్లో - గ్లెన్ మాక్స్‌వెల్
138 బంతుల్లో - క్రిస్ గేల్
140 బంతుల్లో - వీరేంద్ర సెహ్వాగ్
145 బంతుల్లో - శుభ్‌మన్ గిల్

అలాగే, ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వ‌చ్చి  డ‌బుల్ సెంచ‌రీ సాధించిన తొలి ప్లేయ‌ర్ గా కూడా మ్యాక్సివెల్ రికార్డు సృష్టించాడు. అలాగే, ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ గా అత్యధిక  వ్యక్తిగ‌త‌ స్కోరు ఫీట్ ను సాధించాడు.

click me!