ఐపీఎల్... గాలిలోకి ఎగిరి క్యాచ్ పట్టిన డుప్లెసిస్

Published : Apr 29, 2021, 08:03 AM ISTUpdated : Apr 29, 2021, 08:04 AM IST
ఐపీఎల్... గాలిలోకి ఎగిరి క్యాచ్ పట్టిన డుప్లెసిస్

సారాంశం

ఈ మ్యాచ్ లో డుప్లిసెస్ మరోసారి అదరగొట్టాడు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై విజయానికి డుప్లిసెస్ తన వంతు కృషి చేశాడు. ఈ మ్యాచ్ లో అసలు సిసలైన ఎట్రాక్షన్.. డుప్లిసెస్ పట్టిన క్యాచ్ అని చెప్పొచ్చు. గాలిలోకి ఎగిరి మరీ.. స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. 

చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో తన జైత్ర యాత్ర కొనసాగిస్తోంది.  బుధవారం చెన్నై సూపర్ కింగ్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్  జట్లు తలపడగా.. విజయం చెన్నైకే దక్కింది. సన్ రైజర్స్ భారీ లక్ష్యం ముందు ఉంచినా.. చాలా తేలికగా.. స్కోర్ ని ఛేదించింది. ఈ మ్యాచ్ చూసిన తర్వాత.. ఐపీఎల్ లో చెన్నై కి ఇక తిరుగులేదని అర్థమైంది.

కాగా.. ఈ మ్యాచ్ లో డుప్లిసెస్ మరోసారి అదరగొట్టాడు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై విజయానికి డుప్లిసెస్ తన వంతు కృషి చేశాడు. ఈ మ్యాచ్ లో అసలు సిసలైన ఎట్రాక్షన్.. డుప్లిసెస్ పట్టిన క్యాచ్ అని చెప్పొచ్చు. గాలిలోకి ఎగిరి మరీ.. స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. 

 

సన్ రైజర్స్ బ్యాటింగ్ సమయంలో.. 18వ ఓవర్ లో.. మనిష్ పాండే కొట్టిన బంతిని డుప్లిసిస్ పట్టన క్యాచ్ ఇప్పుడు ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్ అధికారిక ట్విట్టర్ లో సైతం డుప్లిసెస్ ఎగిరే ఫోటోని షేర్ చేయడం గమనార్హం. ఫ్లై డూప్లిసెస్ అంటూ.. క్యాప్షన్ కూడా పెట్టారు. చెన్నై అభిమానులు సైతం ఈ క్యాచ్ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా... బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (75), డుప్లెసిస్‌ (56) తొలి ఎదురుదాడి చేయడంతో సన్‌రైజర్స్‌ బౌలర్లు చేతులెత్తేశారు. వీరి కారణంగా విజయం చెన్నైని వరించింది.

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?