CSK vs MI: రాయుడు 'సూపర్', చెన్నై విక్టరీ... హిస్టరీ రిపీట్ చేసిన ముంబై

By team teluguFirst Published Sep 19, 2020, 11:22 PM IST
Highlights

అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అంబటి రాయుడు... మూడో వికెట్‌కి డుప్లిసిస్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యం...

IPL 2020: ఐపీఎల్ 2020లో మొదటి మ్యాచ్ అభిమానులకు క్రికెట్ మజాను అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ అసలు సిసలు టీ20 కిక్‌ను అందించింది. ఛీర్ లీడర్స్ లేకపోయినా, ఖాళీ స్టేడియాల్లో జరిగిన మ్యాచ్ అయినా ఆ ఫీలింగ్ ఎక్కడా సగటు అభిమానికి కలగలేదు. మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను అంబటి రాయుడు, డుప్లిసిస్ కలిసి ఆదుకున్నాడు.

మూడో వికెట్‌కి  115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ... ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఫీల్డింగ్‌లో ముంబై చేసిన తప్పులు కూడా చెన్నైకి బాగా కలిసొచ్చాయి. అంబటి రాయుడు 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి అవుట్ కాగా... డుప్లిసిస్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

రవీంద్ర జడేజా 10 పరుగులు చేసి అవుట్ కాగా... వికెట్లు పడుతున్నా మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కి రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.  ఏడాదిన్నర తర్వాత మాహీ బ్యాటింగ్ చూద్దామని వేచి చూసిన ‘తలైవా’ ఫ్యాన్స్‌కు 19వ ఓవర్ దాకా వేచి చూడక తప్పలేదు. సామ్ కుర్రాన్ ఓ ఫోర్, 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు.

ధోనీ మొదటి బంతికే అవుటై అయినట్టు అంపైర్ ప్రకటించినా, రివ్యూ తీసుకోవడంతో రిప్లైలో బంతి, బ్యాటుకి తగలనట్టు తేలింది. ఆఖరి ఓవర్లో 5 పరుగులు కావాల్సి ఉండగా మొదటి బంతికే ఫోర్ బాదాడు డుప్లిసిస్. దాంతో ముంబై ఓటమి ఖరారైంది. ముంబై బౌలర్లలో  జేమ్స్ ప్యాటిన్సన్, బౌల్ట్‌, కృనాల్ పాండ్యా, బుమ్రా, రాహుల్ చాహార్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. 

2013 నుంచి ప్రతీ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోతూ వచ్చిన ముంబై ఇండియన్స్, దాన్ని ఈ సీజన్‌లోనూ రిపీట్ చేసింది.

click me!