
కరోనా భయంతో ఐపీఎల్‌కి దూరమవుతున్నారు విదేశీ ప్లేయర్లు... చెన్నై సూపర్ కింగ్స్ తరుపున గత సీజన్‌లో ఆడిన ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ జోష్ హజల్‌వుడ్, బయో బబుల్ మీద విరక్తితో ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరమైన విషయం తెలిసిందే.
గత ఎనిమిది నెలలుగా బయో బబుల్‌లో గడుపుతున్నానని, ఐపీఎల్ కోసం మరో రెండు నెలలు అలా గడపలేనని చెప్పిన జోష్ హజల్‌వుడ్, 2021 సీజన్ నుంచి తప్పుకున్నాడు. జోష్ హజల్‌వుడ్ స్థానంలో ఆస్ట్రేలియా యంగ్ పేసర్ బిల్లీ స్టాంలేక్, ఇంగ్లాండ్ పేసర్ రేస్ తోప్లేలను తీసుకోవాలని భావించింది సీఎస్‌కే.
కానీ ఈ ఇద్దరూ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాడు. భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఆడలేమని తేల్చి చెప్పేశారు... దాంతో హజల్‌వుడ్ రిప్లేస్‌మెంట్‌గా మరో ప్లేయర్‌ను వెతికే పనిలో పడింది చెన్నై.