ఫైనల్ ఆడితే బీర్ ఫ్రీ ఇస్తామన్న ఆసీస్ క్రికెటర్.. ఆ కండీషన్ కు ఒప్పుకుంటే తాను ఆడతానన్న మిస్టర్ 360

Published : Jan 27, 2022, 07:10 PM IST
ఫైనల్ ఆడితే బీర్ ఫ్రీ ఇస్తామన్న ఆసీస్ క్రికెటర్.. ఆ కండీషన్ కు ఒప్పుకుంటే తాను ఆడతానన్న మిస్టర్ 360

సారాంశం

Big Bash League Final : బిగ్ బాష్ లీగ్ ఫైనల్ లో భాగంగా.. తుది మ్యాచులో తమతో ఆడటానికి ఒక ప్లేయర్ తక్కువ పడ్డారని, ఎవరైనా వస్తే వారికి ఒక బీర్ ఫ్రీగా ఇస్తామని...

ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మాదిరి విపరీతమైన క్రేజ్ ఉన్న  బిగ్ బాష్ లీగ్ 11 వ సీజన్ (2021-22) తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం జరిగే ఫైనల్ తో  ఈ లీగ్ ముగియనుంది. శుక్రవారం పెర్త్ స్కార్చర్స్.. సిడ్నీ సిక్సర్స్ తో పోటీ పడనుంది. అయితే ఈ మ్యాచుకు ముందు సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు డేనియల్ క్రిస్టియన్  చేసిన ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.  ఫైనల్ ఆడటానికి తమకు ఒక ప్లేయర్ తక్కువ పడ్డారని, ఎవరైనా  తమతో  కలిసి ఆడితే  వారికి ఒక బీర్ ఫ్రీగా ఇస్తామని చెప్పాడు. ఈ ట్వీట్ కు దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్, అభిమానులంతా మిస్టర్ 360 గా పిలుచుకునే ఏబీ డివిలియర్స్  రిప్లై ఇచ్చాడు. ఫైనల్ ఆడటానికి   తాను సిద్ధంగా ఉన్నానని, అయితే  తాను పెట్టిన కండీషన్ కు ఒప్పుకుంటేనే మ్యాచ్ ఆడతానని పేర్కొన్నాడు.  ఈ ఇద్దరి మధ్య  జరిగిన ట్విట్టర్ సంభాషణ వైరల్ గా మారింది. డివిలియర్స్,  క్రిస్టియన్ లు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన విషయం తెలిసిందే.

 వివరాల్లోకెళ్తే.. సిడ్నీ సిక్సర్స్ లో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. శుక్రవారం జరిగే ఫైనల్ ఆడేందుకు ఆ జట్టుకు సరైన ఆటగాళ్లు లేరు.  కీలక ఆటగాళ్లైన మోయిసిస్ హెన్రిక్స్, డేనియల్ హ్యూగ్స్, స్టీవ్ ఒకెఫె, జోర్డాన్ సిల్క్ లు వైరస్ సోకడంతో బుధవారం అడిలైడ్ స్ట్రైకర్స్ తో ముగిసిన మ్యాచులో ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ గా ఉన్న జె లెంటెన్ ను ఆడించింది సిడ్నీ.. అయితే ఈ మ్యాచులో గెలిచినా  ఫైనల్ లో మాత్రం పెర్త్ స్కార్చర్స్ ను ఢీకొనడం ఆషామాషీ కాదు. 

 

ఈ నేపథ్యంలో సిడ్నీ ఆటగాడు డేనియల్ క్రిస్టియన్  ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘రేపు (శుక్రవారం) రాత్రి మెల్బోర్న్ లో ఫైనల్  ఆడబోతున్నాం.  కొవిడ్ లేని 11 మంది ఆటగాళ్ల కోసం  మా జట్టు తీవ్రంగా కష్టపడుతోంది. మాకు కరోనా లేని ఆటగాళ్లు ఫైనల్ కోసం కావాలి. మార్వెల్ స్టేడియంలో మేము రేపు సాయంత్రం 6.30 గంటలకు ప్రాక్టీస్ మొదలుపెట్టబోతున్నాం.  వచ్చినవాళ్లకు  మ్యాచ్ తర్వాత బీర్ కొనిస్తాం.  ముఖ్య గమనిక : టెస్టు క్రికెటర్లకు స్థానం లేదు..’  అని రాసుకొచ్చాడు. 

 

దీనికి డివిలియర్స్ స్పందిస్తూ.. సిడ్నీతో తాను చేరడానికి సిద్ధంగా ఉన్నానని  పేర్కొన్నాడు. అయితే తనకు ఈ మ్యాచులో 4 ఓవర్లు బౌలింగ్  చేయడానికి హామీ ఇస్తేనే ఆడతానని రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇదే ట్వీట్ కు ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ స్పందిస్తూ.. ‘సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా ఆడేందుకు కూడా రెడీ.. కానీ మీకు ఇప్పటికే ఉన్న సబ్ స్టిట్యూట్ లకు డబ్బులు చెల్లించాలేమో..’ అని కౌంటర్ ఇచ్చాడు. 

కాగా బీబీఎల్ ఫైనల్ కు ముందు లీగ్ మ్యాచుల సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్  స్టీవ్ స్మిత్ కూడా సిడ్నీ సిక్సర్స్ తో చేరాలని ఉవ్విళ్లూరాడు. కానీ ఇందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒప్పుకోలేదు.  కరోనా విజృంభిస్తుండటం.. రాబోయే రెండు నెలల్లో కీలక సిరీస్ లు ఉండటంతో ఆసీస్ క్రికెట్ బోర్డుకు అందుకు నిరాకరించింంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?