రాహుల్ స్థానం రోహిత్ దే...బిసిసిఐ ఆలోచనే..: ఎమ్మెస్కే

By Arun Kumar PFirst Published Sep 12, 2019, 11:12 PM IST
Highlights

సౌతాఫ్రికాతో  జరగనున్న టెస్ట్ సీరిస్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నట్లు టీమిండియా హెడ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. బిసిసిఐ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.  

రోహిత్ శర్మ... వన్డే, టీ20 ఫార్మాట్ లో అద్భుతమైన ఓపెనర్. అతడు కుదురుకున్నాడంటే భారీ పరుగులు సాధించడం ఖాయం. ఇలా ఎన్నో మ్యాచుల్లో టీమిండియాకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అలాంటి గొప్ప ఆటగాడు మొన్నటివరకు టెస్ట్ జట్టులో కనీసం చోటు దక్కించుకోలేకపోయాడు.  దురదృష్టమో...సెలెక్టర్లు టాలెంట్  ను గుర్తించకపోవడమో కారణం ఏదైతేనేం రోహిత్  టెస్టుల్లో కనీసం మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ గా కూడా పనికిరాకుండా పోయాడు.   కానీ తాజాగా అతడు టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేసే అరుదైన అవకాశాన్ని పొందాడు. 

గతకొంత కాలంగా రోహిత్ ను టెస్టుల్లో కూడా ఓపెనర్ గా బరిలోకి దించాలని గంగూలీ వంటి మాజీలతో పాటు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ వేదికన జరిగిన వరల్డ్ కప్ లో రోహిత్ అద్భుత ప్రదర్శనతో రికార్డుల మోత మోగించాడు. దీంతో అతడి క్రేజ్ మరింత పెరిగి టెస్టుల్లో అతన్ని ఓపెనింగ్ చేసే అవకాశమివ్వాలన్న డిమాండ్ మరింత పెరిగింది. ఈ డిమాండ్ కు బిసిసిఐ సైతం తలొగ్గాల్సి వచ్చింది. 

స్వదేశంలో దక్షిణాప్రికాతో జరగనున్న టెస్ట్  సీరిస్ లో రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నట్లు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. '' టెస్ట్ క్రికెట్లో కూడా రోహిత్ చేత ఓపెనింగ్ చేయించాలన్న ఆలోచనను బిసిసిఐ అధికారులు కొందరు మాతో పంచుకున్నారు. దీనిపై సెలెక్షన్ కమిటీ సభ్యులమంతా చర్చించి ఏకాభిప్రాయంతో అతన్ని సౌతాఫ్రికా పర్యటన కోసం ఓపెనర్ గా ఎంపిక చేశాం.

ఇందుకోసం కెఎల్ రాహుల్ ను తప్పించాల్సి వచ్చింది. అతన్ని తప్పించినంత మాత్రాన అతడి టాలెంట్ ను మేం అనుమానిస్తున్నట్లు కాదు. నిజానికి అతడో  అద్భుత ఆటగాడు.  కానీ ప్రస్తుతం పామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఇదే సమయంలో రోహిత్ ను టెస్ట్ పార్మాట్ లో కూడా ఓపెనర్ గా పరీక్షించాలని భావించాం. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం.'' అని రోహిత్ ఎంపికకు గల కారణాలను ఎమ్మెస్కే వివరించారు. 

click me!