కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడిపై నిషేదం... బిసిసిఐ సంచలన నిర్ణయం

By Arun Kumar PFirst Published May 30, 2019, 5:59 PM IST
Highlights

భారత యువ క్రికెటర్, ఐపిఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకు సింగ్ పై బిసిసిఐ కన్నెర్రజేసింది. తమ అనుమతి లేకుండా విదేశీ టీ20 లీగ్ లో రింకు పాల్గొనడంపై సీరియస్ అయిన బిసిసిఐ అతడిపై మూడు నెలల పాటు నిషేదం విధించింది. ఈ మేరకు గురువారం  నిషేధానికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. 

ఇటీవల అబుదాబిలో జరిగిన అనధికారిక టీ20 లీగ్  లో రింకూ పాల్గొన్నాడు. అయితే ఈ లీగ్ లో ఆడేందుకు ఇందుకోసం బిసిసిఐ అనుమతి తీసుకోలేదు. ఇలా బోర్డు నియమ నిబంధనలు ఉళ్ళంఘించడాన్ని సీరియస్ గా తీసుకున్న బిసిసిఐ అతడిని మూడు నెలల పాటు క్రికెట్ కు దూరం పెట్టింది.  

బిసిసిఐ నిషేదం కారణంగా ఈ  యువ క్రికెటర్ భారత ''ఎ'' జట్టుకు దూరం కానున్నాడు. అంతేకాకుండా  మే 31 నుండి  శ్రీలంక ''ఎ'' తో ప్రారంభంకానున్న మ్యాచ్ కు కూడా దూరం కానున్నాడు. రింకుపై  విధించిన నిషేధం జూన్ 1 నుండి అమల్లోకి వచ్చి మూడు నెలల పాటు కొనసాగుతుందని  బిసిసిఐ ప్రకటించింది. 

భవిష్యత్ లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా వుండేందుకు ఇలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి  వచ్చిందని బిసిసిఐ అధికారులు తెలిపారు. దేశ ప్రతిష్టకు సంబంధించిన ఈ  క్రీడలో నిబంధనలను పాటించాల్సిందేనని...లేని పక్షంలో  క్రికెటర్ల కెరీర్ నాశనం అవుతుందన్నారు. ఆటగాళ్లకు ఉపయోగపడుతూనే క్రికెట్ అభివృద్దికి తోడ్పడేలా బిసిసిఐ నిబంధనలున్నాయని...వాటిని ప్రతి ఆటగాడే పాటించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. 

click me!