బ్రేకింగ్: మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ.. అభిమానుల్లో ఆందోళన

Siva Kodati |  
Published : Jan 27, 2021, 03:20 PM ISTUpdated : Jan 27, 2021, 03:21 PM IST
బ్రేకింగ్: మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ.. అభిమానుల్లో ఆందోళన

సారాంశం

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో  హుటాహుటిన  కోలకతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో  హుటాహుటిన  కోలకతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల గుండెపోటుకు  గురై , కోలుకున్న దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్‌  అభిమానుల్లో ఆందోళన  కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గంగూలీకి మంగళవారం ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది.

కానీ బుధవారం ఆ నొప్పి  మరింత పెరగడంతో  గ్రీన్ కారిడార్ ద్వారా ముందు జాగ్రత్తగా గంగూలీని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
శ్రేయాస్ అయ్యర్ విధ్వంసక సెంచరీ.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం